iDreamPost
android-app
ios-app

Liger : పూరి విజయ్ బ్యాక్ టు బ్యాక్ – ఏంటి కథ

  • Published Feb 07, 2022 | 8:31 AM Updated Updated Feb 07, 2022 | 8:31 AM
Liger : పూరి విజయ్ బ్యాక్ టు బ్యాక్ – ఏంటి కథ

విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా లెవెల్ లో పూరి జగన్నాధ్ తీస్తున్న లైగర్ షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టేశారు. విడుదలకు ఇంకా ఆరు నెలల సమయం ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ కోసం కావలసినంత టైం దొరుకుతోంది. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ప్రత్యేక పాత్ర పోషించిన ఈ మూవీలో అనన్య పాండే హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమవుతోంది. ఆగస్ట్ 25 రిలీజ్ బ్లాక్ చేశారు కాబట్టి అప్పటిదాకా పూరికి చాలా టైం ఉంది. తన కెరీర్ లో ఇప్పటిదాకా ఎక్కువ ప్లానింగ్ చేసిన చిత్రం లైగరే. పోకిరి, ఇడియట్ లాంటి బ్లాక్ బస్టర్స్ కి కూడా ఇంత లాంగ్ ప్లానింగ్ చేసుకున్న దాఖలాలు లేవు. అఫ్కోర్స్ కరోనా ఒక కారణమే అని చెప్పాలి.

సరే ఇది అయిపోయిన వెంటనే పూరి విజయ్ బ్యాక్ టు బ్యాక్ మరో ప్రాజెక్టుకి రెడీ కావడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. అఫీషియల్ గా చెప్పనప్పటికీ దానికి సరిపడా లీకులు బయటికి ఇచ్చేశారు. ఇదేదో కొత్త కథ కాదు. అప్పుడెప్పుడో మహేష్ బాబు కోసం పూరి సిద్ధం చేసుకున్న జనగణమననే ఇప్పుడు విజయ్ దేవరకొండతో తీయబోతున్నాడు. అసలెందుకు సడన్ గా నిర్ణయం తీసుకున్నారనే డౌట్ రావడం సహజం. విజయ్ దేవరకొండ ఇప్పటికిప్పుడు వెంటనే కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే స్టేజిలో లేడు. శివ నిర్వాణ, సుకుమార్ లతో కమిట్ మెంట్ అయ్యింది కానీ వెంటనే షూట్ మొదలెట్టే పరిస్థితిలో వాళ్ళు లేరు.

సుకుమార్ ఇంకా పుష్ప పార్ట్ 2 మొదలుపెట్టాలి. ఎంతలేదన్నా ఆరునెలలకు పైగా పడుతుంది. ఆపై ప్రమోషన్లు పబ్లిసిటీ అన్నీ కలిపి డిసెంబర్ దాకా బ్లాక్ అయిపోయారు. శివ నిర్వాణ స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ లాక్ కాలేదట. ఇంకొంచెం టైం అడిగినట్టు తెలిసింది. మరోవైపు పూరి కూడా వేరే హీరోతో సినిమా సెట్ చేసుకోలేదు. సో ఇద్దరికీ చేతిలో టైం ఉంది కాబట్టి ఇలా జనగణమనకు వెళ్లినట్టుగా కనిపిస్తోంది. రెండేళ్లకు పైగా విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి రేంజ్ బ్లాక్ బస్టర్ పడలేదు. గీత గోవిందం స్థాయి హిట్టు కొట్టలేదు. అందుకే ఆశలన్నీ లైగర్ మీదే పెట్టుకున్నాడు. ఇది కనక గురి చూసి కొడితే పాన్ ఇండియా లెవెల్ లో సెటిల్ కావొచ్చు

Also Read : Bheemla Nayak : పవన్ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న సినిమాలు