iDreamPost
android-app
ios-app

World Cup 2023: పెద్ద జట్లను ముంచుతున్న చెత్త ఫార్ములా!

World Cup 2023: పెద్ద జట్లను ముంచుతున్న చెత్త ఫార్ములా!

వరల్డ్ కప్ 2023లో మ్యాచులు ఆసక్తికరంగాన కాదు.. ఉత్కంఠగా కూడా సాగుతున్నాయి. మ్యాచుల్లో ఊహించని ఫలితాలు నమోదు అవుతున్నాయి. పసికూనలు విజృంభిస్తుంటే.. బడా బడా జట్లు చతికిల పడుతున్నారు. చిన్న చిన్న జట్ల మీద ఓటమి చవిచూస్తూ చెత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. ఈ మ్యాచులు చూసిన తర్వాత అందరూ చిన్న జట్లను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కానీ, అసలు బడా జట్లు చేస్తున్న తప్పేంటి అనేది ఆలోచించడం లేదు. అయితే ఇక్కడ పెద్ద జట్లు అన్నీ చేస్తున్న ఒక కామన్ తప్పు ఉంది. దాని వల్లే ఇలాంటి ఫలితాలు నమోదు అవుతున్నాయి.

ఈ క్రికెట్ వరల్డ్ కప్ లో కొన్ని మ్యాచుల ఫలితాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. అక్టోబర్ 15న ఆఫ్గనిస్థాన్- ఇంగ్లాండ్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచులో ఎవరన్నా ఇంగ్లాండ్ గెలుస్తుంది అనుకుంటారు. కానీ, అనూహ్యంగా ఆఫ్గనిస్థాన్ గెలిచింది. అది కూడా ఏకంగా 69 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. బౌలింగ్ లో ఇంగ్లాండ్ తేలిపోయింది అనే చెప్పాలి. గుర్బాజ్(80), ఇక్రామ్ అలిఖిల్(58) అద్భుతంగా రాణించారు. మరోవైపు బ్యాటింగ్ లో కూడా ఇంగ్లాండ్ తేలిపోయింది. 9.3 ఓవర్లు మిగిలి ఉండగానే కేవలం 215 పరుగలుకే ఆలౌట్ చేసింది. హ్యారీ బ్రూక్(66), డేవిడ్ మలాన్(32) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులను సంబ్రమాశ్చర్యాలకు గురి చేసింది అనే చెప్పాలి.

అక్టోబర్ 17న ఇంకో అద్భుతమైన మ్యాచ్ జరిగింది. సౌత్ ఆఫ్రికా జట్టును నెదర్లాండ్స్ జట్టు 38 పరుగుల తేడాతో షాకింగ విజయం నమోదు చేసింది. సౌత్ ఆఫ్రికా జట్టు బౌలర్లను దాటిగా ఎదుర్కొంటూ నెదర్లాండ్స్ బ్యాటర్లు 245 పరుగులు చేశారు. అటు బ్యాటుతోనే కాకుండా బాల్ తోనూ నెదర్లాండ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. 42.5 ఓవర్లకే సౌత్ ఆఫ్రికా జట్టును ఆలౌట్ చేసింది. డేవిడ్ మిల్లర్(43), కేశవ్ మహరాజ్(40) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అయితే ఈ రెండు మ్యాచులు చూసిన తర్వాత క్రికెట్ అభిమానుల మదిలో తొలుస్తున్న ఒకే ఒక ప్రశ్న ఏంటంటే.. అసలు ఇంత పెద్ద జట్లు ఇలాంటి చిన్న జట్ల చేతుల్లో ఎందుకు ఓడిపోతున్నాయి? అయితే అందుకు బలమైన కారణమే ఉంది.

ఈ పెద్ద పెద్ద జట్లు చాలా పెద్ద పెద్ద పొరపాట్లు చేస్తున్నాయి. చెత్త చెత్త ఫార్ములాలను అవలంభిస్తూ ఘోర పరాభవాలను చవిచూస్తున్నాయి. ఆ చెత్త ఫార్ములాలు ఏంటంటే.. టీ20 ఫార్ములాను వన్డే మ్యాచుల్లో అప్లయ్ చేస్తున్నారు. అగ్రెసివ్ అప్రోచ్ చూపిస్తున్నారు. కొడితే భారీ భారీ స్కోర్లు నమోదు చేస్తున్నారు. లేదంటే కేవలం 200 పరుగుల్లోపే ఆలౌట్ అవుతున్నారు. ఎవరూ కూడా నిలబడి నిలకడగా ఆడాలి, వికెట్లు కోల్పోతున్నాం.. స్టాండ్ తీసుకోవాలి అనే ఆలోచన ప్లేయర్లలో కనిపించడం లేదు. ఓపిగ్గా ఆడాల్సిన ఫార్మాట్​లో అనవసర బాదుడుకు వెళ్తున్నారు. ఆ చెత్త ఫార్ములానే జట్టుకు విజయాలను దూరం చేస్తోంది. క్లిక్ అయితే భారీ విజయాలు లేదా ఘోర ఓటములు అన్నట్లుగా ఆడేస్తున్నారు. ఇలాంటి ఫార్ములాలను పాటించడం వల్లే పెద్ద పెద్ద జట్లు కూడా ఘోర పరాజయాలను నమోదు చేస్తున్నాయి. ఇప్పటికైనా ఫార్మాట్ కు తగ్గట్లు బ్యాటింగ్, బౌలింగ్ స్ట్రాటజీలను మార్చుకోకపోతే ఎంత పెద్ద జట్టు అయినా పసికూనల చేతిలో పరాజయం కాక తప్పదు అంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. మరి.. దిగ్గజ జట్లు పాటిస్తున్న ఈ ఫార్ములాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి