iDreamPost
android-app
ios-app

బ్యాంక్ ఖాతాదారులకు RBI గుడ్ న్యూస్! పెద్ద తలనొప్పి తగ్గించింది!

  • Published Jan 04, 2024 | 1:28 PM Updated Updated Jan 04, 2024 | 1:28 PM

ఇప్పటికి చాలా మంది బ్యాంకు అకౌంట్ లో మినిమమ్ బ్యాలన్స్ ను కూడా మెయింటెయిన్ చేయకుండా ఉంచుతారు. అయితే, అలాంటి ఖాతాదారులు పెనాల్టీ కట్టవలసి వస్తుంది. తాజాగా, ఆర్బీఐ ఈ విషయమై కొత్త నియమాలను అమలులోకి తీసుకుని వచ్చింది.

ఇప్పటికి చాలా మంది బ్యాంకు అకౌంట్ లో మినిమమ్ బ్యాలన్స్ ను కూడా మెయింటెయిన్ చేయకుండా ఉంచుతారు. అయితే, అలాంటి ఖాతాదారులు పెనాల్టీ కట్టవలసి వస్తుంది. తాజాగా, ఆర్బీఐ ఈ విషయమై కొత్త నియమాలను అమలులోకి తీసుకుని వచ్చింది.

  • Published Jan 04, 2024 | 1:28 PMUpdated Jan 04, 2024 | 1:28 PM
బ్యాంక్ ఖాతాదారులకు RBI గుడ్ న్యూస్! పెద్ద తలనొప్పి తగ్గించింది!

సాధారణంగా బ్యాంకు ఖాతాల్లో కనీసం బ్యాలన్స్ లేకుంటే.. వారికి ఆయా బ్యాంక్స్ వారు పెనాల్టీ చార్జీలను విధిస్తారు. ఈ పెనాల్టీ విషయం ఒక్కో నగరంలో ఒక్కో విధంగా అమలు పరుస్తారు. గతంలో కూడా ఇలా జీరో బ్యాలన్స్ మెయింటెయిన్ చేసేవారి ఖాతాలు, ఇన్ యాక్టీవ్ లో ఉన్న వారి ఖాతాల గురించి ఆర్బీఐ కొన్ని నియమాలను ఆదేశించింది. అయితే, ఇప్పటికి కొన్ని బ్యాంకులు మాత్రమే ఆ విధానాలను పాటిస్తున్నాయి. ఇక తాజాగా, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. రెండు సంవత్సరాలుగా ఎలాంటి కనీస బ్యాలన్స్ లేని అకౌంట్లపై.. ఎలాంటి పెనాల్టీ ఛార్జీలు విధించవద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.

చాలా వరకు బ్యాంకులలో జీరో బ్యాలన్స్ అకౌంట్స్ ను మెయింటెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, బ్యాంక్ అకౌంట్స్ లో మినిమమ్ బ్యాలన్స్ ను కూడా మెయింటెయిన్ చేయాలి. జీరో బ్యాలన్స్ విషయమై శాలరీ అకౌంట్స్ కు ప్రత్యేక హక్కు ఉంటుంది. హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంకులలో కనీస నిల్వ రూ.1,000 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది. అయితే, కొన్ని ఖాతాల్లో కనీస అమౌంట్ కూడా ఉండదు. మరి కొందరు వారి అకౌంట్స్ ను సంవత్సరాల తరబడి ఉపయోగించకుండా.. అలా వదిలేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అకౌంట్ క్రియేట్ చేసిన సంగతి కూడా మర్చిపోతూ ఉంటారు. అప్పుడు ఇలా ఎక్కువ కాలం ఉపయోగించని అకౌంట్స్ కు ఫైన్స్ వేస్తూ ఉంటారు బ్యాంక్ అధికారులు. దీని వలన వినియోగదారుడు నష్ట పోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మినిమమ్ బ్యాలన్స్ మెయింటెయిన్ చేయలేకపోయినా.. ఎటువంటి పెనాల్టీ వసూలు చేయవద్దని RBI తెలిపింది.

కాగా , క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్లను తగ్గించే ప్రయత్నంలో రిజర్వ్‌ బ్యాంక్‌..తీసుకున్న వివిధ నిర్ణయాలలో ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఒకటి. అలాగే, తర్వాత ఆర్డర్‌లో స్కాలర్‌షిప్ నిధులను స్వీకరించడానికి క్రియేట్ చేసిన బ్యాంక్ ఖాతాలను కూడా .. ఇన్‌యాక్టివ్ బ్యాంక్ ఖాతాలుగా మార్చడానికి వీలు లేదని RBI ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా రెండేళ్ల వరకు ఏదైనా బ్యాంక్ ఖాతాను ఉపయోగించకపోతే బ్యాంకులు వాటిని పనిచేయని ఖాతాలు కింద పరిగణిస్తాయి. దీని కారణంగా ఖాతాదారుడు కాస్త ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఏదేమైనా, RBI తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వినియోగదారులకు పెద్ద రిలీఫ్ ను ఇచ్చిందని చెప్పి తీరాలి. ఇకపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని.. వినియోగదారులు భావిస్తున్నారు. మరి, పని చేయని ఖాతాలకు కూడా కనీస చార్జీలను విధించకూడదని.. RBI తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.