iDreamPost
android-app
ios-app

రవితేజ సరసన ముగ్గురు హీరోయిన్లు

  • Published Mar 09, 2021 | 6:34 AM Updated Updated Mar 09, 2021 | 6:34 AM
రవితేజ సరసన ముగ్గురు హీరోయిన్లు

ఈ ఏడాది ప్రారంభంలో డబుల్ కిక్ ఇచ్చిన క్రాక్ బ్లాక్ బస్టర్ రవి తేజ అతని అభిమానులకే కాదు మొత్తం ఇండస్ట్రీకే మంచి బూస్ట్ ఇచ్చింది. సగం సీట్లతో కూడా ఇంత స్థాయిలో వసూళ్లు రాబట్టడం చూసి మీడియా సైతం ఆశ్చర్యపోయింది. ఆ తర్వాతే మిగిలిన సినిమాలు కూడా ధైర్యం చేస్తే వాటికి కూడా మంచి స్పందన దక్కింది. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ చేస్తున్న రవితేజ మే 28న మళ్ళీ థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాడు. అదే రోజు బోయపాటి శీను బాలకృష్ణల సినిమా ఉండటంతో వాయిదా పడుతుందా లేక క్లాష్ కి సిద్ధమంటారా లాంటి వివరాలు తెలియాల్సి ఉంది. ఖిలాడీ ఇప్పటికే సగం పైగానే పూర్తయ్యింది.

దీని తర్వాత త్రినాథరావు డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ ని దాదాపుగా లాక్ చేశారు. ప్రస్తుతం స్క్రిప్టింగ్ పనులు జరుగుతున్నాయి. ఇందులో ముగ్గురు హీరోయిన్లు కనువిందు చేయబోతున్నారు. ఐశ్వర్య మీనన్, శ్రీలీల ఇప్పటికే కన్ఫర్మ్ కాగా తాజాగా గాలి సంపత్ ఫేమ్ లవ్లీ సింగ్ ను కూడా త్రినాథరావు సినిమా కోసం లాక్ చేశారు. వీళ్ళందరూ కొత్తవాళ్లే కావడం గమనార్హం. ఈ మధ్యకాలంలో మాస్ రాజా ఇలా ఒకేసారి ముగ్గురితో రొమాన్స్ చేయడం గత కొన్నేళ్లలో జరగలేదు. ఆ రకంగా చూస్తే అభిమానులకు మంచి కనువిందు ఖాయమైనట్టే. దీనికి ప్రసన్నకుమార్ రచయితగా వ్యవహరిస్తున్నారు.

ఇదయ్యాక ఎవరితో రవితేజ సినిమా ఉంటుందనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. వక్కంతం వంశీతో చేయొచ్చన్నారు కానీ దాని గురించి స్పష్టత లేదు. నా పేరు సూర్య తర్వాత దాని ఫలితం వల్ల వంశీకి చాలా గ్యాప్ వచ్చింది. అయినప్పటికీ రవితేజకు చెప్పిన లైన్ బాగుండటంతో ఓకే చెప్పినట్టుగా గతంలోనే టాక్ వచ్చింది. అధికారిక ప్రకటన వచ్చే దాకా ఏదీ చెప్పలేం. వీటి సంగతలా ఉంచితే రవితేజ త్వరలో స్వంత ప్రొడక్షన్ లో వెబ్ సిరీస్ లు, బడ్జెట్ లో చిన్న సినిమాలు కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది. మొత్తానికి ఏదైతేనేం రాజా ది గ్రేట్ తర్వాత క్రాక్ రూపంలో దొరికిన సక్సెస్ ఇలాగే కంటిన్యూ అవ్వడం కంటే కావాల్సింది ఏముంటుంది