iDreamPost
android-app
ios-app

రామారావు ఫిక్సయ్యాడు – శేష్ తో ఢీ

  • Published Jun 22, 2022 | 5:20 PM Updated Updated Jun 22, 2022 | 5:24 PM
  • Published Jun 22, 2022 | 5:20 PMUpdated Jun 22, 2022 | 5:24 PM
రామారావు ఫిక్సయ్యాడు – శేష్ తో ఢీ

ఇప్పటికే పలు వాయిదాలు పడ్డ రామారావు ఆన్ డ్యూటీ ఫైనల్ గా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. జూలై 29న థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. నిజానికిది మార్చ్ లో ప్లాన్ చేసుకున్న మూవీ. ఆర్ఆర్ఆర్ వల్ల పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఆ తరువాత ఏప్రిల్ అనుకున్నారు కానీ కెజిఎఫ్ 2 తదితర పోటీ వల్ల కుదరలేదు. కట్ చేస్తే అసలు నిజం ఏంటంటే రామారావు షూటింగే పూర్తి కాలేదని తర్వాత తెలిసింది. కొంత బ్రేక్ తీసుకుని ఏవో తెరవెనుక కారణాల వల్ల కొంత ఆలస్యం చేశారు. ఫైనల్ గా బ్యాలన్స్ ఉన్న పార్ట్ ని పూర్తి చేసేందుకు ఇవాళ్టి నుంచి మాస్ మహారాజా రవితేజ రంగంలోకి దిగారు. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.

అయితే రామారావు ప్రస్తుతానికి సోలో రిలీజ్ దక్కించుకోలేదు. అదే రోజు అడవి శేష్ హిట్ 2 వస్తోంది. మేజర్ సూపర్ హిట్ తర్వాత శేష్ మార్కెట్ పెరిగింది. ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసే అవకాశం లేకపోలేదు. మొదటి భాగంలో నటించిన విశ్వక్ సేన్ స్థానంలో కొత్త కేసుతో అడవి శేష్ రీ ప్లేస్ అయ్యాడు. న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ క్రైమ్ డ్రామాకు శైలేష్ కొలను దర్శకుడు. ఎప్పుడో డేట్ ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వెనక్కు తగ్గకపోవచ్చు. సో రవితేజ వర్సెస్ శేష్ క్లాష్ తప్పదని అర్తమైపోయింది. దానికి ముందు వారం సుదీప్ విక్రాంత్ రోనా తప్ప ఇంకేం లేవు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

శరత్ మండవ దర్శకత్వం వహించిన రామారావు ఆన్ డ్యూటీ టీజర్ వచ్చి రెండు నెలలు దాటింది. ఇప్పుడు ట్రైలర్ ని సిద్ధం చేస్తున్నారు. క్రాక్ బ్లాక్ బస్టర్ తర్వాత ఖిలాడీ మరీ దారుణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ గాయం మానాలంటే రామారావు ఆన్ డ్యూటీ బాగా ఆడాలి. రెవిన్యూ ఆఫీసర్ గా రవితేజ ఎలాంటి ఎనర్జీ చూపిస్తాడో వెయిట్ చేయాలి. దీని తర్వాత ఇదే ఏడాది ధమాకా కూడా వచ్చేస్తుంది. దసరా లేదా దీపావళికి ప్లాన్ చేసుకున్నారు. చిరంజీవితో చేస్తున్న వాల్తేరు వీరయ్య షెడ్యూల్ ఆగస్ట్ నుంచి ఉండొచ్చు. టైగర్ నాగేశ్వర్ రావు, రావణాసుర రిలీజులు వచ్చే ఏడాది ఉంటాయి. మొత్తానికి సీనియర్లలో రవితేజనే మహా స్పీడ్ మీదున్నాడు.

 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom