iDreamPost
iDreamPost
ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తుంది. త్వరలోనే అక్కడ కూడా స్టార్ హీరోయిన్ అవ్వబోతుంది ఈ నేషనల్ క్రష్. ఇటీవల రష్మిక తన పెట్ డాగ్ తో ఉన్న ఫోటోలు పోస్ట్ చేసింది. అయితే రష్మిక పెట్ డాగ్ తనని వదిలి ఉండట్లేదని పోస్ట్ చేసింది.
దీంతో రష్మిక పెట్ డాగ్ ని కూడా షూటింగ్స్ కి తీసుకెళ్తుందని. ఆ కుక్క కి కూడా తనతో పాటు ఫ్లయిట్ టికెట్స్ బుక్ చేయమని నిర్మాతని అడిగినట్లు, నిర్మాత షాక్ అయినట్లు కొన్ని సైట్స్ వార్తలు రాశాయి. ఈ వార్తలు రష్మిక వరకు వెళ్లడంతో ఓ సైట్ రాసిన ఈ న్యూస్ ని రష్మిక ట్విట్టర్ లో షేర్ చేసి స్పందించింది.
రష్మిక ఆ వార్తలని షేర్ చేసి.. మరీ ఇలా బిహేవ్ చేయకండి. ఆరా(రష్మిక కుక్క పేరు) నాతో ప్రయాణించాలని మీరు కోరుకున్నా.. అది నాతో కలిసి ప్రయాణించడం ఇష్టం లేదు. ప్రస్తుత ఆరా హైదరాబాద్లో చాలా సంతోషంగా ఉంది. మీరు దానికోసం ఆందోళన చెందుతున్నందుకు థ్యాంక్స్. క్షమించండి ఇది చూసి నవ్వు ఆపుకోలేకపోతున్నాను అని సెటైరికల్ గా పోస్ట్ చేసింది.
Sorry but this made my day..🤣 couldn’t stop laughing..🤣🤣
— Rashmika Mandanna (@iamRashmika) June 24, 2022