iDreamPost
android-app
ios-app

బ్లాక్ యాపిల్స్.. దీని ఖరీదు ఎంతో తెలిస్తే ఔరా అంటారు!

  • Published Nov 18, 2023 | 4:32 PM Updated Updated Nov 18, 2023 | 4:32 PM

ప్రపంచంలో ఎన్నో రకాల పండ్లు మనకు లభిస్తాయి. కానీ కొన్ని పండ్లు మన ఆరోగ్యాన్నికి ఎంతో మేలు చేస్తుంటాయి. అలాంటి పండ్లలో ఒకటి యాపిల్.

ప్రపంచంలో ఎన్నో రకాల పండ్లు మనకు లభిస్తాయి. కానీ కొన్ని పండ్లు మన ఆరోగ్యాన్నికి ఎంతో మేలు చేస్తుంటాయి. అలాంటి పండ్లలో ఒకటి యాపిల్.

బ్లాక్ యాపిల్స్.. దీని ఖరీదు ఎంతో తెలిస్తే ఔరా అంటారు!

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే.. వ్యాయామం, యోగా తో పాటు మంచి ఆహారం తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. అలాంటి ఆహార పదార్థాల్లో పండ్ల పాత్ర ఎంతో ఉంటుంది. కొన్ని పండ్లలో అద్భుతమైన ఆరోగ్యం దాగి ఉంది. ప్రకృతి లో ఎన్నో అరుదైన పండ్ల జాతులు ఉన్నాయి. పండ్లు మన శరీరానికి కావాలసినంత ప్రొటీన్లు, పోషకాలను అందిస్తాయి. అలాంటి పండ్లలో ఒకటి యాపిల్. ప్రతిరోజూ ఒక యాపిల్ పండు తింటే అనేక రోగాలకు చెక్ పెట్టవొచ్చు, ఆరోగ్యంగా జీవించవొచ్చని వైద్యులు చెబుతుంటారు. మనకు మార్కెట్ లో ఎక్కువగా రెడ్, గ్రీన్ కలర్ యాపిల్స్ కనిపిస్తుంటాయి.. ఎప్పుడైనా బ్లాక్ యాపిల్ ని చూశారా? అరుదైన ఈ యాపిల్ గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ప్రకృతి ప్రసాదించిన పండ్లలో ఒకటి యాపిల్. యాపిల్స్ లో శరీరానికి కావాలసిన సహజమైన యాంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందుకే ఎక్కువగా వైద్యులు యాపిల్స్ తినాలని సూచిస్తుంటారు. తలనొప్పి, ఊబకాయం, కీళ్లనొప్పులు, ఆస్తమా, నిద్రలేమి, అనీమియా, జలుబు ఇలా ఎన్నో రకాల రోగాలు యాపిల్స్ తినడం వల్ల నయం అవుతాయని అంటారు. యాపిల్ ని నేరుగా అయినా తినవొచ్చు, జ్యూస్ చేసుకొని దాగవచ్చు. మనకు యాపిల్స్ అనగానే ఎక్కువగా రెడ్, గ్రీన్ కలర్స్ లో కనిపిస్తాయి. కానీ బ్లాక్ యాపిల్ ఉంటుందని ఇది చాలా అరుదైన యాపిల్ అని చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఈ యాపిల్ అరుదైనదే కాదు.. అద్భుతమైన ఔషదాలు కూడా దాగి ఉన్నాయి. యాపిల్ జాతుల్లో ఇది చాలా ప్రత్యేకమైన పండు అని చెబుతుంటారు. ఈ పండులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అంతేకాదు ఈ పండు ఖరీదు కూడా చాలా ఎక్కువే.

యాపిల్ పండ్లలో చాలా రేర్ గా కనిపించే బ్లాక్ యాపిల్ లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది ఎన్నో రకాల రోగాలను నయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి కేవలం చైనా, టిబెట్ లోని పర్వత ప్రాంతాల్లో మాత్రమే పండుతాయి. బ్లాక్ యాపిల్స్ ని ‘బ్లాక్ డైమండ్ యాపిల్స్’ అని కూడా పిలుస్తుంటారు. పైన నల్లగా ఉన్నప్పటికీ లోపల మాత్రం సాధారణ యాపిల్ మాదిరిగానే ఉంటుంది. ఈ పండు చూడటానికి నల్లగా నిగ నిగలాడుతూ చూడగానే తినేయాలనే కోరిక కలుగుతుంది. సాధారణంగా యాపిల్స్ రెండు మూడేళ్లలో కాపుకు వస్తాయి.. కానీ బ్లాక్ యాపిల్ తొలిపండ చేతికి రావడానికి మాత్రం ఎనిమిదేళ్లు పడుతుంది. బ్లాక్ యాపిల్ డయాబెటీస్ ని కంట్రోల్ చేయడంలో బాగా పనిచేస్తుంది అని వైద్య నిపుణులు అంటున్నారు. ఇదిలా ఉంటే బ్లాక్ యాపిల్ ఖరీదు కూడా చాలా ఎక్కువే.. ఒక్కో పండు రూ.500 వరకు ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో బ్లాక్ డైమండ్ యాపిల్స్ కి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.