iDreamPost
android-app
ios-app

1945 : రానా సినిమా కూడా ఆర్ఆర్ఆర్ లైన్ లోనే

  • Published Dec 09, 2021 | 7:52 AM Updated Updated Dec 09, 2021 | 7:52 AM
1945 : రానా సినిమా కూడా ఆర్ఆర్ఆర్ లైన్ లోనే

ఇవాళ సోషల్ మీడియా మొత్తం ఆర్ఆర్ఆర్ జ్వరంతో ఊగిపోతోంది. రాజమౌళి టెక్నికల్ బ్రిలియన్స్ కి అన్ని బాషల దర్శకులు నిర్మాతలు సాహో అంటున్నారు. థియేటర్ లో వదిలిన గంటకే యూట్యూబ్ లో రిలీజ్ చేయడం రికార్డులు బద్దలు కావడం మొదలయ్యింది. ఇవాళే రానా సినిమా 1945 విడుదల తేదీని ప్రకటించడం గమనార్హం. దానికి ట్రిపులార్ కి దీనికి కనెక్షన్ ఏంటి అనుకుంటున్నారా. ఇది కూడా స్వాతంత్ర సమరం బ్యాక్ డ్రాప్ లోనే తీసింది. ఎప్పుడో మూడేళ్ళ క్రితం షూటింగ్ పూర్తయినా ఏవో కారణాల వల్ల వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఒకదశలో ఈ సినిమాతో నాకు ఎలాంటి సంబంధం లేదని గతంలో రానా చెప్పాడు

ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ ఈ 1945 హక్కులను చేజిక్కించుకుని డిసెంబర్ 31న విడుదల చేస్తున్నారు. జరగదనుకున్న పెళ్ళికి వచ్చిందే కట్నం అన్న తరహాలో ఎంతో కొంత రెవిన్యూ వస్తుందనే అంచనాలో ఉన్నారు. సత్యశివ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ డ్రామాకు యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చడం గమనార్హం. సత్యరాజ్, నాజర్ లాంటి సీనియర్ క్యాస్టింగ్ ఇందులో ఉంది. ఇంత ఆలస్యం దేనికో కారణాలు మాత్రం బయటికి చెప్పడం లేదు. విరాటపర్వం కోసం ఎదురు చూస్తున్న అభిమానులు దానికన్నా ముందు ఈ సినిమాతో సర్దుకోవాలన్న మాట. అదే రోజు కీర్తి సురేష్ గుడ్ లక్ సఖితో పాటు మరికొన్ని బడ్జెట్ చిత్రాలు లైన్ లో ఉన్నాయి

ఇంతకీ ఇందులో రానా సొంత డబ్బింగ్ ఉంటుందో లేదో థియేటర్లో చూశాకే తెలుస్తుంది. తమిళ వెర్షన్ వస్తోందా రాదా కూడా చెప్పడం లేదు. అయినా హీరోనే అనాసక్తి ప్రదర్శించిన సినిమా ఏదో అద్భుతం చేస్తే తప్ప వసూళ్లు రావు. కాకపోతే వెరైటీగా ఆర్ఆర్ఆర్ బ్యాక్ డ్రాప్ లోనే ఇది కూడా ఉండటం విశేషం. రానా నుంచి ఎలాంటి ట్వీట్ అయితే ఇప్పటిదాకా లేదు. రానా స్క్రీన్ మీద కనిపించి చాలా గ్యాప్ వచ్చింది. విరాటపర్వం పంచాయితీ ఎటూ తేలడం లేదు. దీనికన్నా ముందు నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు వచ్చేస్తుందేమో. బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నటించిన ఫుల్ లెన్త్ సిరీస్ ఇది. వచ్చే ఏడాది ప్రారంభంలో స్ట్రీమ్ చేస్తారు

Also Read : Anudeep : జాతిరత్నాలు డైరెక్టర్ కొత్త ప్రాజెక్ట్ ఇదేనా