iDreamPost

Ram Charan: ఆస్ట్రేలియాలో రామ్ చరణ్ 2 నెలలు స్పెషల్ ట్రైనింగ్.. ఆ సినిమా కోసమే

  • Published Jun 22, 2024 | 11:48 AMUpdated Jun 22, 2024 | 11:48 AM

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీలో నటించనున్నాడు. ఇక ఈ సినిమా ఇంక షూటింగ్ దశలోనే ఉంది. కాగా, మరో పది రోజుల్లో ఈ మూవీ షూటింగ్ పూర్తు చేసుకోనున్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలో రామ్ చరణ్ 2 నెలలు ఆస్ట్రేలియాలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకునున్నాడట. ఇంతకి ఎందుకంటే..

గ్లోబల్ స్టార్ ‘రామ్ చరణ్’.. ప్రస్తుతం ఈ హీరో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాకి డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ భారీ బడ్జెట్ సినిమాకు దిల్ రాజ్ ప్రొడ్యూసర్ గా నిర్మిస్తున్నారు. అయితే గేమ్ ఛేంజర్ మూవీలో చరణ్ రెండు విభిన్న పాతత్రల్లో కనిపించనున్నాడు. కాగా,అందులో ఒకటి తండ్రి పాత్రగా.. రెండవది కొడుకుగా చేయనున్నారు.ఇకపోతే ఈ సినిమాలో నవీన్ చంద్ర , సునీల్, సముద్రఖని వంటి తదితరులు నటించనున్నారు. ఇక ప్రస్తుతానికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ ఇంక షూటింగ్ దశలోనే ఉంది. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కానీ, శంకర్ ప్రస్తుతం కమలహాసన్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక భారతీయుడు మూవీ షూటింగ్ కూడా చివరి దశలో పూర్తి కావొచ్చింది. కాబట్టి, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీని మరో వారం పది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. అయితే ఈ షూటింగ్ పూర్తవ్వగానే రామ్ చరణ్ తన ఫ్యామిలీతో వెకెషన్స్ కి వెళ్లానున్నారు. ఇక ఆ వెకెషన్స్ పూర్తి చేసుకున్న వెంటనే..  రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇక ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు సమాచారం.

Ram charan

అయితే ఈ సినిమా కోసం రామ్ చరణ్ రెండు నెలలు వరకు ఓ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారట. పైగా ఆ ట్రైనింగ్ అనేది ఆస్ట్రేలియాలో తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే .అందుకే ఈ సినిమా షూటింగ్ ను ఆగస్టు లో ప్రారంభించేలా చూస్తున్నట్లు తెలుస్తుంది .ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఇప్పటికే శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ కు మంచి అంచనాలు ఉన్నాయి. మరి, తర్వలో విడుదల కానున్న గేమ్ ఛేంజర్ మూవీ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుదో చూడాల్సి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి