iDreamPost
android-app
ios-app

క్లిన్ కారాపై స్పెషల్ వీడియో.. మెగా ఫ్యామిలీ ఎమోషనల్ మూమెంట్స్!

క్లిన్ కారాపై స్పెషల్ వీడియో.. మెగా ఫ్యామిలీ ఎమోషనల్ మూమెంట్స్!

సరిగ్గా నెల క్రితం ఇదే రోజు మెగా ఫ్యామిలీలో ఆనందాలు వెల్లి విరిశాయి. రామ్ చరణ్- ఉపాసన దంపతులకు పండంటి ఆడపిల్ల జన్మించింది. 11 ఏళ్ల తర్వాత తమ ఇంట్లోకి మెగా వారసురాలు అడుగు పెట్టింది. ఆ బుల్లి ప్రిన్సెస్ కు క్లిన్ కారా అని పేరు పెట్టినట్లు మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. ఉపాసన గుడ్ న్యూస్ చెప్పినప్పటి నుంచి క్లిన్ కారా మెగా ఇంట అడుగు పెట్టిన వరకు జరిగిన మొత్తం ఆనంద క్షణాలను ఒక డాక్యుమెంటరీగా రూపొందించి రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

నిజానికి మెగా వారసురాలి కోసం చిరంజీవి కుటుంబం ఎంతగా ఎదురు చూసిందో.. ఫ్యాన్స్ కూడా అలాగే ఎదురుచూశారు. ఇంకెప్పడు గుడ్ న్యూస్ చెప్తారంటూ వారిని అడుగుతూనే ఉన్నారు. అదే విషయాన్ని చెబుతూ రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యాడు. దేనికైనా సమయం, సందర్భం రావాలి. ఏది ఎప్పుడు జరగాలి అని రాసి పెట్టి ఉంటుందో అది అప్పుడే జరుగుతుంది అన్నట్లు రామ్ చరణ్ చెప్పాడు. బేబీ తన సమయాన్ని నిర్ణయించుకుంది వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ 11 ఏళ్లలో తమని చాలా మంది చాలా అన్నారు అంటూ చెర్రీ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈ 9 నెలల సమయాన్ని ఎంతగానో ఆశ్వాదించానన్నాడు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ వీడియోలో ఒక చిన్న పిల్లాడిలా రామ్ చరణ్ ను హగ్ చేసుకోవడం చూసి ఆయన ఈ క్షణం కోసం ఎంతగా ఎదురుచూశారో అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఈ మొత్తం వీడియో ఒక విషయం అందరినీ ఆశ్యర్యానికే కాకుండా ఆలోజింపచేస్తోంది. అదేంటంటే మెగా వారసురాలు క్లిన్ కారాను చెంచుల ట్రైబ్ లో ఒక భాగం అంటూ ఉపాసన వెల్లడించింది. తన పేరు వెనుక ఎలాంటి ట్యాగ్స్ ఉండవంటూ చెప్పుకొచ్చింది. చెంచులు అంటే కేవలం హార్డ్ వర్క్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది. క్లిన్ కారా బారసాల రోజు చెంచుల జాతికి చెందిన వారితో పూజా క్రతువు కూడా చేయించారు. ఆ మొత్తం కార్యక్రమాన్ని కూడా ఈ వీడియోలో చూపించారు. రామ్ చరణ్- ఉపాసన ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం, దానికి ఇరు కుటుంబాలు అంగీకరించడం అస్సలు చిన్న విషయం కాదు. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో ఉపాసన ఇలాంటి నిర్ణయం తీసుకు ఎంతో మందికి ఆదర్శంగా మారిందనే చెప్పాలి. సమాజం పట్ల బాధ్యత, మనుషుల్లో మార్పు రావాలని ఉపాసన ఎల్లప్పుడూ కోరుకుంటుందనే విషయం అందరికీ తెలుసు. ఆమె ఒక సోషల్ వర్కర్ అని.. జంతు ప్రేమికురాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుని సమాజాని చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిందనే చెప్పాలి. మెగా ఫ్యామిలీ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

Jojobet GirişmeritbetmeritbetjojobetCasibom girişjojobetJojobet GirişcasibomjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibom