iDreamPost
iDreamPost
ఆర్ఆర్ఆర్ ఇంటర్వెల్ బ్లాక్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు పాల్గొంటున్న రామ్ చరణ్ త్వరలో ఆచార్య సెట్స్ లోకి అడుగు పెట్టాల్సి ఉంది. నిజానికి డిసెంబర్ లోనే ప్లాన్ చేసుకున్నప్పటికీ కరోనా సెకండ్ వేవ్ వార్తలతో చిరంజీవి ఇంకొంత టైం తీసుకోవాలని నిర్ణయించుకోవడంతో ఇద్దరూ జనవరిలోనే జాయిన్ అవుతారని లేటెస్ట్ అప్ డేట్. ఈలోగా ఆ ఇద్దరు లేని సన్నివేశాలతో పాటు ఇప్పటిదాకా జరిగిన పోర్షన్ కు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా దర్శకుడు కొరటాల శివ పూర్తి చేయిస్తున్నారు. ఇటీవలే సోనూ సూద్ కూడా ఎంటరైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇమేజ్ పెరిగింది కాబట్టి స్క్రిప్ట్ లో తన కోసం స్వల్ప మార్పులు కూడా జరిగాయట.
రామ్ చరణ్ ఆచార్యలో సుమారు ఆరగంట నుంచి నలభై నిమిషాల మధ్యలో కనిపించే అవకాశాలు ఉన్నాయట. ఇది చాలా కీలకమైన ఎపిసోడ్ కావడం అందులోనూ తండ్రి కొడుకుల ఫుల్ లెన్త్ ఫస్ట్ కాంబినేషన్ అవ్వడం వల్ల అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకునే ప్లాన్ చేసినట్టుగా తెలిసింది. రామ్ చరణ్ రాజమౌళితో దీనికి సంబంధించిన చర్చలు చేసే డేట్స్ ని పక్కాగా లాక్ చేసుకుని మరీ ప్లాన్ చేసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఆచార్యలో తన భాగం పూర్తయిపోతే టెన్షన్ ఉండదు. ఎలాగూ వేసవి విడుదలకు ప్లాన్ చేశారు కాబట్టి తాను ఇంకా ఆలస్యం చేస్తే ఇబ్బందులు ఎదురు కావొచ్చు.
ఇక ఆర్ఆర్ఆర్, ఆచార్య తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా ఎవరితో అనే సస్పెన్సు మాత్రం ఇంకా కొనసాగుతోంది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లందరూ వాళ్ళ వాళ్ళ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఎన్ని కథలు వింటున్నా ఎందరు దర్శకులు తనను కలుస్తున్నా మీడియాకు లీక్ కాకుండా చరణ్ టీమ్ చాలా జాగ్రత్తలు వహిస్తోంది. ధృవ సీక్వెల్ కోసం తమిళ దర్శకుడు మోహన్ రాజా ఇప్పటికే ప్రతిపాదన ఉంచినట్టు సమాచారం. లూసిఫర్ రీమేక్ కూడా తనకే ఇచ్చేలా ఆలోచన జరుగుతోందట. అసలు ఎవరితో చరణ్ చేస్తాడో అంతుచిక్కడం లేదు కానీ మొత్తానికి చరణ్ ప్లానింగ్ చాలా గుట్టుగా జరుగుతున్న మాట వాస్తవం