iDreamPost
android-app
ios-app

వీడియో: రాకేష్ మాస్టర్ మూడో భార్యపై ఐదుగురు మహిళలు దాడి!

వీడియో: రాకేష్ మాస్టర్ మూడో భార్యపై ఐదుగురు మహిళలు దాడి!

టాలీవుడ్ లో రాకేష్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన కెరీర్ ముగిసిన తర్వాత యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులను అలరించారు. ఆ సమయంలోనే కుటుంబానికి దూరంగా ఉంటూ.. వంట చేసేందుకు వచ్చిన లక్ష్మిని తన మూడో భార్యగా పరిచయం చేశారు. ప్రస్తుతం ఆ లక్ష్మి పేరు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే.. ఆమెపై ఐదుగురు మహిళలు దాడి చేశారు. నడిరోడ్డుపై ఆమెను చితకబాదారు. ఆ ఘటనకు సంబంధించి పరస్పరం ఫిర్యాదులు కూడా నమోదు చేశారు.

వంట మనిషి లక్ష్మి రాకేష్ మాస్టర్ వివాహం చేసుకున్నారా లేదా అనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. ఆమెను మాత్రం తన భార్యగా పరిచయం చేశారు. సహజీవనం చేస్తున్నాం అన్నట్లుగా చెప్పుకొచ్చారు. అయితే కొన్నాళ్లకు వారి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇద్దరూ దూరంగా ఉండటం మొదలు పెట్టారు. తాజాగా ఆమెపై హైదరాబాద్ పంజాగుట్ట ప్రాంతంలో ఐదుగురు మహిళలు దాడి చేశారు. స్నేహితుడితో కలిసి స్కూటీ మీద వెళ్తున్న సమయంలో ఆమెను అడ్డగించి దాడికి దిగారు. ఆమెను విచక్షణారహితంగా కొట్టారు. జుట్టు పట్టుకుని రోడ్డు మీద పడేసి మరీ కొట్టారు. లక్ష్మి స్నేహితుడు వారిని అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితంగా లేకుండా పోయింది.

ఆ ఘటన చూస్తున్న స్థానికులు డయల్ 100కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మహిళలు అందరినీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముందుగా లక్ష్మి పోలీస్ స్టేషన్ కు చేరుకుంది తనపై దాడి చేసిన మహిళలపై ఫిర్యాదు చేసింది. తర్వాత మీడియాతో మాట్లాడిన లక్ష్మి తనను రెండు నెలలుగా కొందరు చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించింది. అయితే ఆ బెదిరింపులను తాను తేలిగ్గా తీసుకుందని.. ఇలీ దాడికి దిగుతారని అస్సలు ఊహించలేదని చెప్పింది.

నెల్లూరుకు చెందిన భారతి రూ.లక్ష ఇచ్చి తనపై ఈ దాడి చేయించినట్లు ఆరోపించింది. పెరుగు పెద్దమ్మ, లల్లి, భారతి, మరో మహిళతో కలిసి ఈ దాడి చేశారని తెలిపింది. మరోవైపు యూట్యూబర్ లల్లీ సైతం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన మైనర్ కుమార్తె గురించి అసభ్యంగా మాట్లాడుతూ లక్ష్మి వీడియోలు చేసినట్లు తెలిపింది. పోలీసులకు ఆ వీడియోలు కూడా చూపించినట్లు తెలుస్తోంది. ఈ దాడికి మరో కారణం కూడా ఉందని చెబుతున్నారు. రాకేష్ మాస్టర్ ఛానల్ ను ఈ లక్ష్మి లాగేసుకుందని.. దానిని తిరిగి తీసుకునేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. అందుకు లల్లీ వాళ్లు సహకరిస్తున్నారని తెలుస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ