iDreamPost
android-app
ios-app

జగపతిబాబు దారిలో రాజశేఖర్ ?

  • Published Nov 16, 2020 | 7:38 AM Updated Updated Nov 16, 2020 | 7:38 AM
జగపతిబాబు దారిలో రాజశేఖర్ ?

యాంగ్రీ మెన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని, ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న రాజశేఖర్ ఇటీవలే కోవిడ్ బారిన పడి కోలుకుని క్షేమంగా ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే. గరుడవేగ పర్వాలేదు అనేలా ఆడటం తప్ప చాలా ఏళ్ళుగా సక్సెస్ కు దూరంగా ఉన్న రాజశేఖర్ లాక్ డౌన్ కు ముందు కూడా కొత్త ప్రాజెక్ట్ ఏదీ కమిట్ కాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కల్కి నిరాశపరచడంతో ఎలాంటి పాత్రలు చేయాలన్న దాని మీద తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. సోలో హీరోగా వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు తగ్గిపోతున్నాయి కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ కెరీర్ ని కొత్తగా మొదలుపెట్టే ప్లానింగ్ లో ఉన్నట్టు తెలిసింది.

అందులో భాగంగానే బాలకృష్ణ బోయపాటి శీను కాంబినేషన్లో రూపొందుతున్న టైటిల్ నిర్ణయించని సినిమాలో రాజశేఖర్ ని విలన్ గా తీసుకుంటే ఎలా ఉంటుందన్న చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే దీనికి సంబంధించిన క్లారిటీ రావడానికి టైం పడుతుంది. ఇప్పటికే రెండు మూడు ఆప్షన్లు అనుకుని డ్రాప్ అయ్యారు. హీరోయిన్ల విషయంలోనూ ఇలాగే తర్జనభర్జనలు పడి ఫైనల్ గా సాయేషా సైగల్ ను లాక్ చేసుకున్నారు. ఇంకో ఇద్దరు కావాలట. మొత్తానికి షూటింగ్ తిరిగి ప్రారంభమైనా బిబి3 ఎంపికకు చిక్కులు మాత్రం తప్పడం లేదు. వచ్చే వేసవికి విడుదలను ప్లాన్ చేసుకున్నారు.

ఒకవేళ ఇది నిజంగా జరిగితే మంచిదే. గతంలో జగపతిబాబు ఇలాంటి స్టేజిలోనే ఉన్నప్పుడు లెజెండ్ తో ఇచ్చిన విలన్ ఎంట్రీ ఆయన్ను ఎక్కడికో తీసుకెళ్లింది. ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ విలన్ కం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హై డిమాండ్ లో ఉన్నాడు. రాజశేఖర్ సైతం గతంలో కథ నచ్చితే విలన్ గా చేసేందుకు సిద్ధమని ఇంటర్వ్యూలో చెప్పారు. ధృవలో చేయాలని ఇష్టపడ్డారు కూడా. కానీ అరవింద్ స్వామికి ముందు ఫిక్స్ అవ్వడంతో అది చేజారింది. కెరీర్ ప్రారంభంలో రాజశేఖర్ ఆహుతి లాంటి సినిమాల్లో నెగటివ్ పాత్రలు చేసి మెప్పించారు. ఇప్పుడు లేట్ ఏజ్ లోనూ అదే హెల్ప్ అవుతుందేమో