iDreamPost
android-app
ios-app

మొన్న ఒబామా .. నిన్న మోడీ.. నేడు రజని

మొన్న ఒబామా .. నిన్న మోడీ.. నేడు రజని

బేర్ గ్రిల్స్… పరిచయం అవసరం లేని పేరు.. డిస్కవరీ ఛానెల్ చూసే ప్రతి ఒక్కరికీ బేర్ గ్రిల్స్ తెలిసేఉంటుంది. ఎందుకంటే అందులో ప్రసారమయ్యే “మ్యాన్ వర్సెస్ వైల్డ్” అనే ప్రోగ్రాం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు బేర్ గిల్స్..

అయితే ఈసారి బేర్ గ్రిల్స్ తో కలిసి సూపర్ స్టార్ రజనీకాంత్ బేర్ గ్రిల్స్ తో కలిసి మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాంలో సందడి చేయనున్నారు.బందీపూర్ ప్రాంతంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఆరు గంటల పాటు బేర్ గిల్స్ తో రజనీకాంత్ అడవిలో గడపనున్నారు.

గతేడాది ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ అటవీ ప్రాంతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బేర్ గిల్స్ తో కలిసి సందడి చేసారు. ఆగస్ట్ 12, 2019 న ప్రసారమైన ఈ కార్యక్రమం, వన్యప్రాణుల సంరక్షణను ప్రస్తావిస్తుందని అప్పట్లో డిస్కవరీ ఛానెల్ తెలిపింది. దాదాపు 180 దేశాల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం విశేష ప్రజాదరణ దక్కించుకుంది.

2015 లో అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా బేర్ గ్రిల్స్ తో రన్నింగ్ విత్ బేర్ గ్రిల్స్ అనే టీవీ షో చేసారు.. ఆ ఎపిసోడ్ కూడా విశేష జనాదరణను పొందింది.. తన అధ్యక్ష పాలనలో రన్నింగ్ విత్ బేర్ గ్రిల్స్ ఎపిసోడ్ ఒక తీపి గుర్తు అని ఒబామా పేర్కొనడం గమనార్హం..

సెలెబ్రిటీలతో,ప్రముఖ నాయకులతో బేర్ గ్రిల్స్ చేస్తున్న ఈ సాహస యాత్రలకు మంచి పేరు రావడమే కాకుండా విశేష ప్రేక్షకాదరణ కూడా లభిస్తుంది. కాగా నేటి నుండి ఈ నెల 30 వరకూ బేర్ గ్రిల్స్ తో కలిసి చిత్రీకరణలో పాల్గొనున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. దేశ ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత బేర్ గ్రిల్స్ తో గడపబోతున్న సెలబ్రిటీ రజనీకాంత్ కావడం విశేషం..

కానీ ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం కానుందో ఇంకా డిస్కవరీ ఛానెల్ వెల్లడించలేదు..

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet