శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా.. ఈ పేర్లు ఇటు సినిమా ఇండస్ట్రీకి, అటు వ్యాపార రంగానికి కొత్తేమీకాదు. పైగా అశ్లీల చిత్రాల వీడియో కేసులో రెండేళ్ల క్రితం రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో అతడు ఆరు నెలల పాటు జైలులో ఉన్నారు. ఆ సమయంలో అతడు ఎలాంటి మానసిక సంఘర్షణకు గురయ్యాడో తెలియజేస్తూ.. వస్తున్న చిత్రం’యూటీ 69′. ఈ చిత్రం ద్వారా రాజ్ కుంద్రా నటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కాగా.. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమంలో తన భార్య శిల్పాశెట్టిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు రాజ్ కుంద్రా. ఆ రోజు శిల్ప తనపైకి చెప్పు విసిరిందని షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. మరి ఇంతకీ శిల్ప తన భర్తపై చెప్పు ఎందుకు విసిరిందో ఇప్పుడు తెలుసుకుందాం.
శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా నటుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. అతడు ‘యూటీ 69’ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అవ్వబోతున్నాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం ముంబైలో జరిగింది. ఈ వేడుకలో పలు షాకింగ్ విషయాలు వెల్లడించాడు రాజ్ కుంద్రా. అతడు నటుడిగా ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు శిల్ప రియాక్షన్ చూసి షాక్ అయ్యాడట. ఇక ఆమెను ఒప్పించడానికి కాస్త సమయం పట్టిందని ఈ సందర్భంగా తెలిపాడు. ఈ కార్యక్రమంలో రాజ్ కుంద్రా మాట్లాడుతూ..
” నా జీవితంలో నేను ఎదుర్కొన్న కఠిన పరిస్థితులను ఆధారంగా చేసుకుని యూటీ 69 తెరకెక్కించాం. అందుకే ఇందులో నేనే నటించాలనుకున్నా. ఈ విషయం శిల్పకు చెప్పిన రోజు నేనెప్పటికీ మర్చిపోలేను. నేను సినిమా చేయాలనుకుంటున్నాను, నా దగ్గర స్క్రిప్ట్ సిద్దంగా ఉందని చెప్పగానే.. నాపైకి చెప్పు విసిరింది. దాంతో నేను షాకయ్యా. అయితే డైరెక్టర్ షానవాజ్ అలీ ఆమెకు కథ వినిపించడంతో.. ఒప్పుకుని అప్పటి నుంచి ఎంతో సపోర్టీవ్ గా నిలిచింది. షూటింగ్ టైమ్ లో అంతా ఓకేనా? యాక్ట్ చేయగలవా? అంటూ తరచూ అడిగి అండగా నిలుచుంది” అంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు రాజ్ కుంద్రా. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.