iDreamPost
android-app
ios-app

రాహుల్ వైఖరిలో మార్పు వచ్చినట్లేనా?ఢిల్లీ అత్యాచార కేసు-ప్రత్యక్ష కార్యాచరణకు దిగిన రాహుల్

రాహుల్ వైఖరిలో మార్పు వచ్చినట్లేనా?ఢిల్లీ అత్యాచార కేసు-ప్రత్యక్ష కార్యాచరణకు దిగిన రాహుల్

దేశ రాజ‌ధాని ఢిల్లీలో గ‌త ఆదివారం జ‌రిగిన 9 ఏళ్ల బాలిక అత్యాచారం, హ‌త్య ఘ‌ట‌న సామాజికంగానే కాదు.. రాజ‌కీయంగానూ క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ విచార‌ణ‌కు ఆదేశించారు. అయితే, ఢిల్లీ పోలీసులు కేసును ప‌క్క‌దారి ప‌ట్టిస్తూ, నిందితుల‌ను త‌ప్పించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగాగా కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు.

బాలికపై సామూహిక అత్యాచారం, హత్య ఘటన ఇప్పుడు దేశ రాజధానిలో ప్రకంపనలు పుట్టిస్తోంది. బాలిక తల్లిదండ్రుల అనుమతి లేకుండానే రాత్రికి రాత్రే అంత్యక్రియలు పూర్తి చేయడంతో ఇది ఇంకా ఆగ్రహ జ్వాలలను రప్పిస్తోంది. తీవ్ర ఆగ్రహానికి గురైన దాదాపు 200 మంది స్థానికులు సంఘ‌ట‌న జ‌రిగిన రోజే భారీ నిరసనకు దిగారు. సీసీటీవీ పుటేజీని పరిశీలించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. పూజరితోపాటు, శ్మశాన వాటికలో పనిచేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు డీసీపీ ఇంగిత్‌ ప్రతాప్‌సింగ్‌ ప్రకటించినా బాధిత కుటుంబ స‌భ్యులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read:బద్వేల్ బరిలో నిలిచేందుకు ఆపార్టీ భయపడుతోందా?

పోలీసులు అందించిన సమాచారం ఢిల్లీ కంటోన్మెంట్ పరిధిలోని శ్మశానవాటికు సమీపంలో మోహన్ లాల్, సునీతా దేవి దంపతులు ఇంట్లో నివసిస్తున్నారు. వీరి కుమార్తె బాలిక శ్మశాన ప్రాంగణంలోకి వెడుతూ వుంటుంది. అలాగే ఫ్రిజ్‌లో నీళ్లు తాగేందుకు ఆదివారం సాయంత్రం కూడా వెళ్లింది. ఆ తరువాతనుంచి కనిపించకుండా పోయింది. కుమార్తెకోసం వెదుకుతున్న తల్లి అక్కడికెళ్లి చూడగా మృతదేహం కనిపించింది. దీంతో ఫ్రిజ్ వాటర్ తాగుతున్న సమయంలో బాలిక విద్యుత్ షాక్‌కి గురై చనిపోయిందని ఆ పూజారి, అక్కడే పనిచేసే మరో ముగ్గురు సిబ్బంది నమ్మ బలికారు. అంతేకాదు పోస్టుమార్టం పేరుతో భయపెట్టి, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని బెదిరించారు.

పోలీసులు అమ్మాయి అవయవాలను అమ్ముకుంటారంటూ కల్లబొల్లి మాటలతో మభ‍్య పెట్టారు. కుటుంబ సభ్యులంతా ఈ అమోమయంలో ఉండగానే హడావిడిగా బాలిక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో బాలిక శరీరంపై పలుచోట్ల గాయాలను గమనించిన తల్లిదండ్రులకు తమ అనుమానం మరింత బలపడింది. చివరకు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కుమార్తెను అత్యాచారం చేసి చంపేసారంటూ పూజారి సహా నలుగురిపై ఆరోపణలు నమోదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు పూజారి రాధేశ్యామ్, సలీమ్, లక్ష్మీ నారాయణ్, కుల్దీప్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు.

Also Read:రేవంత్ రెడ్డి ప్లాన్ వర్కౌట్ అవుతుందా…

ఇదిలా ఉండ‌గా.. అత్యాచారం, హ‌త్య‌కు గురైన మైన‌ర్ బాలిక కుటుంబాన్ని రాహుల్‌గాంధీ ప‌రామ‌ర్శించారు. బుధ‌వారం ఉద‌యాన్నే బాధితురాలి ఇంటి వెళ్లిన రాహుల్‌గాంధీ.. ఆమె కుటుంబ‌స‌భ్యులు కాసేపు మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ కేసు విష‌యంలో న్యాయం జ‌రిగే వ‌ర‌కు వారికి అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు. బాధితురాలు కేవ‌లం ఆ కుటుంబానికి మాత్ర‌మే ఆడ‌బిడ్డ కాద‌ని, ఈ దేశానికి చెందిన ఆడ‌బిడ్డ అని రాహుల్ వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన అనంత‌రం మీడియాతో మాట్లాడిన రాహుల్‌గాంధీ.. బాధితురాలు కుటుంబంతో మాట్లాడాను. వారు ఈ కేసులో న్యాయం జ‌రుగాల‌ని కోరుకుంటున్నారు. అంత‌కుమించి వారు ఇంకేం ఆశించ‌డం లేదు. వారికి సాయం కావాలి. మేం ఆ సాయం చేస్తాం. ఆ కుటుంబానికి అండ‌గా నిల‌బడుతాం. న్యాయం జ‌రిగే వ‌ర‌కు రాహుల్‌గాంధీ ఆ కుటుంబానికి అండ‌గా ఉంటాడు అని ఆయ‌న హామీ ఇచ్చారు.