Idream media
Idream media
రాష్ట్ర విభజన అనంతరం జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఏపీ కాంగ్రెస్ ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి రాకుండా కనీస ప్రాతినిథ్యం ఉండేలా చేసేందుకు అగ్ర నాయకత్వం ఎంతలా ప్రయత్నిస్తున్నా.. శ్రేణుల్లో ఉత్సాహం నింపేవారు కరువయ్యారు. రాహుల్ గాంధీ దృష్టి సారించినా పార్టీ గాడినపడడం లేదు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న సాకే శైలజానాథ్ కనీస ప్రయత్నాలు చేసినట్లుగా ఎక్కడా కనిపించడం లేదు. తెలంగాణ కాంగ్రెస్‌కు రేవంత్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించిన కాంగ్రెస్ హైకమాండ్.. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌ను ప్రక్షాళన చేసి.. పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టేందుకు శత విధాలా ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, పల్లంరాజు, రఘువీరారెడ్డి సహా పలువురు నేతలతో విడివిడిగా రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. పార్టీలోని దళిత నేతలు హర్షకుమార్, చింతామోహన్, జేడీ శీలంతో కూడా చర్చించారు. కానీ నాయకత్వం వహించేందుకు ఎవరూ అంతగా సుముఖంగా లేనట్లు తెలిసింది. ఎందుకంటే.. ఏపీలో కనీసం వేయి ఓట్లు వచ్చే పరిస్థితి లేకపోవడమే ఇందుకు కారణం. తెలంగాణాలో రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ లో ఉత్తేజం వచ్చింది. ఆయన డైనమిక్ లీడర్ షిప్ తో కాంగ్రెస్ అక్కడ గట్టిగానే దూసుకుపోతోంది. మరి ఏపీలో పాతతరం సైడ్ అయిపోతోంది. కొత్తతరానికి పరిచయం అయ్యే ముఖాలు అయితే లేవు అనే చెప్పాలి.
దాంతో కాంగ్రెస్ పార్టీని భుజాల మీద వేసుకుని ఏపీలో నడిపించే వారి అవసరం ఉందనే చెప్పాలి. అలాంటి నవ యువ నాయకత్వానికే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ లో చర్చ అయితే సాగుతోంది అంటున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ కి అనుకూలత ఉంది నూతన నాయకత్వం రావాలి ఏపీ కాంగ్రెస్ కి అన్న ఫీడ్ బ్యాక్ వచ్చిందని అనుకుంటున్నారు. దాంతో తెలంగాణాలో చేసిన ప్రయోగం మారిదిగానే ఏపీలో కూడా చేయడం ద్వారా రేవంత్ రెడ్డి లాంటి యువ నాయకత్వానికి పార్టీ బాధ్యతలు అప్పగించాని భావిస్తున్నారుట. అది కూడా బలమైన రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికే బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఈ మేరకు రాహుల్ గాంధీకి ఫీడ్ బ్యాక్ వచ్చిందని ఆయన దీని మీద సీరియస్ గానే ఆలోచన చేస్తున్నారు అని టాక్. రెడ్డి సామాజిక వర్గానికి బలమైన నాయకుడికి పగ్గాలు అప్పగించడానికి రాహుల్ అయితే రెడీ అంటున్నారు. మొత్తానికి స్టూడెంట్ లీడర్ గా ఉన్న వారికి వర్తమాన సమాజాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న వారిని జనాలను ముఖ్యంగా యూత్ ని కదిలించగలిగే వారికి పీసీసీ పట్టం కడితే ఏపీలో కాంగ్రెస్ కాస్తోకూస్తో పుంజుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.