Idream media
Idream media
నర్సాపురం నుంచి వైసీపీ తరఫున ఎంపీగా గెలిచిన రఘురామక్రిష్ణంరాజు కొద్ది కాలంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారారు. అధికార పార్టీ నుంచి గెలిచి.. సర్కారుపైనే విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. మరి స్వతాహాగా ఆయనకే జగన్ తో చెడిందో, లేదా ఎవరి డైరెక్షన్ అయినా ఉందో తెలియదు కానీ.. విపక్షాలకు మద్దతుగా పని చేస్తున్నారు. ఆయన కేవలం వైసీపీనే టార్గెట్ చేస్తున్నారు. మిగిలిన పార్టీలను పల్లెత్తు మాట అనడం లేదు. చంద్రబాబునైతే కౌగిలించుకుంటున్నారు. పైగా బాబు ఏ ఆరోపణలు అయితే జగన్ మీద చేస్తున్నారో అవే ఆరోపణలు రాజు చేయడం ద్వారా బాబు మనసు కూడా గెలిచారనే అనుకోవాలి.
ఇక కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఆయన మొదటి నుంచీ సాన్నిహిత్యంగా మెలుగుతున్నారు. దీంతోనే ఆయన ఏపీలో ఏకైక ప్రత్యర్ధిగా వైసీపీని చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయనపై త్వరలోనే అనర్హత వేటు వేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. లేదా ఆయన రాజీనామా చేస్తారని కూడా ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు. ‘‘త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తా. రాజధాని అమరావతి అజెండాతో మళ్లీ ఎన్నికలకు వెళ్తా’’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. వైసీపీకి తనపై అనర్హత వేటు వేయించటానికి ఎంత సమయం కావాలో చెప్పాలని సవాల్ కూడా విసిరారు. అంతేకాకుండా.. ఇప్పుడు కూడా ప్రభుత్వంపై ఎన్నో ఆరోపణలు చేశారు.
కాగా.. ఆయన రాజీనామా చేస్తే నర్సాపురానికి ఉప ఎన్నికలు రావడం ఖాయం. అదే జరిగితే వైసీపీ గెలుస్తుందా రాజు గెలుస్తారా అన్నదే ఇపుడు ఇంటెరెస్టింగ్ చర్చ. కానీ గ్రౌండ్ లెవెల్లో రాజు అంతా సెట్ చేసుకుంటున్నారుట. ఒకవేళ ఉప ఎన్నికలే వస్తే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసి విపక్షాల మద్దతు తీసుకుంటారట. అంటే బీజేపీ జనసేన కూటమితో పాటు, టీడీపీ కూడా మద్దతు తనకు ఇచ్చేలా చేసుకుంటారని అంటున్నారు. కానీ.. ప్రస్తుతం ఏపీలో వైసీపీపై గెలిచే సత్తా ఎవరికైనా ఉందా? అందులోనూ ఆ పార్టీ గుర్తుపై పోటీ చేసి.. దాన్నే ధిక్కరిస్తుండడంపై ప్రజల్లో ఆయన చులకనయ్యారు. పైగా.. అమరావతి ఎజెండాతో ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే.. అమరావతి అంశం చంద్రబాబుకే కలిసి రాలేదు. అలాంటి సమయంలో అది రాజుగారిని గెలిపిస్తుందా?
Also Read : వేటుకు ఆగడమెందుకు రఘురామా?.. రాజీనామా చేసి సత్తా చాటవచ్చుగా!