iDreamPost
android-app
ios-app

మరికొద్దిసేపట్లో రఘురామ రాజు పిటిషన్ విచారణ

మరికొద్దిసేపట్లో రఘురామ రాజు పిటిషన్ విచారణ

రాజద్రోహం కేసులో అరెస్టు అయిన నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజుపై సీఐడీ విచారణ కొనసాగుతుంది. నిన్న ఆయనను హైదరాబాద్ లో అరెస్టు చేసిన పోలీసులు.. గుంటూరు సీఐడీ కార్యాలయంలో ప్రశ్నించారు. అర్ధరాత్రి వరకూ సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ విచారించారు. అనంతరం రాత్రి సీఐడీ కార్యాలయంలోనే రఘురామకృష్ణరాజుకి వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఇవాళ అధికారులు రఘురామకృష్ణరాజును మరోసారి విచారించనున్నారు. మరోవైపు రాత్రి అత్యవసరంగా కోర్టులో రఘరామ తరపు న్యాయవాదులు హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిగే వరకు రఘురామరాజు ను కింది కోర్టులో ప్రవేశ పెట్టద్దని కోర్టు ఆదేశించింది. అప్పటివరకు మెడిసన్ , ఫుడ్ బయట నుంచి తీసుకోవచ్చని కోర్టు ఆదేశించింది. కాగా హౌజ్ మోషన్ పిటిషన్ పై మధ్యాహ్నం 1 గంటలకు విచారణ జరగనుంది.

అటు ఈ విచారణలో భాగంగా డీఐజీ సునీల్‌ పలు రకాల ప్రశ్నలు వేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎందుకు కుట్రపన్నారని చెప్పాలన్నారు. ఎవరి ప్రోదాల్బంతో సీఎం జగన్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని క్వశ్చన్ చేశారు. ప్రభుత్వ వ్యవస్థల పట్ల ప్రజల్లో చులకన భావం వచ్చేలా ఎందుకు వ్యాఖ్యలు చేశారో చెప్పాలన్నారు. పలు విషయాల్లో రఘురామకృష్ణరాజు వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ ను సైతం పోలీసులు ఉపయోగించి విచారించినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ.. సోషల్ మీడియా వేదికగా కులాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారంటూ ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. హైదరాబాద్‌ మణికొండ బౌల్డర్స్‌ హిల్స్‌ లోని ఆయన నివాసానికి వెళ్లిన సీఐడీ బృందం.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు భద్రత కల్పిస్తున్న సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది తొలుత ఆయన్ను అరెస్టు చేయనీయకుండా అడ్డుకున్నారు. వారికి సీఐడీ పోలీసులు అరెస్టుకు కారణాలు వివరించడంతో వెనక్కి తగ్గారు. సీఐడీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు.

ఇటీవల కొన్ని న్యూస్‌ చానల్స్, కొందరు వ్యక్తుల ప్రోద్బలంతో రఘురామకృష్ణరాజు నిత్యం వీడియోలను ప్రసారం చేస్తున్నట్టు గుర్తించిన ఏపీ సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్‌ ప్రాథమిక దర్యాప్తునకు ఆదేశించారు. ఆయన మాటలు ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను కించపరిచేలా ఉన్నాయని గుర్తించారు. ప్రాథమికంగా లభించిన ఆధారాలతో సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌ కుమార్‌ ఆదేశాలతో రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు 124(ఎ), కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు 153(ఎ), బెదిరింపులకు పాల్పడటం 505, కుట్ర పూరిత నేరం 120(బి) సెక్షన్లపై కేసు నమోదైంది.