వైరల్ అవుతున్న రఘురామ కృష్ణంరాజు కామెంట్స్..

రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల కొన్ని వివాదాలకు కేంద్ర బిందువు అయిన నాయకుడు, కేంద్రంలోని పలువురు నేతలతో సత్సంబంధాలు కలిగిన వైసీపీ ఎంపీ.. తన నోటి దురుసుతో వైసీపీ అధిష్టానం వరకూ వెళ్లి రాజకీయంగా జిల్లాలో కాస్త డ్యామేజ్ అయిన రఘురామ కృష్ణంరాజు.. తాజాగా నాయకత్వం రఘురాజు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.

దీనిపై జిల్లా పార్టీలోనూ చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా ఉండి మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ఎంపిక విషయంలో స్థానిక నాయకుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఉండి నియోజకవర్గ వైసీపీలోని పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సర్రాజు, ఉండి నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ పీవీఎల్ నరసింహరాజుల వర్గాలు తమ వారికే ఛైర్మన్ సీటివ్వాలని డిమాండ్ చేయడంతో అక్కడ అంతర్గతంగా ముసలం ఏర్పడింది. ఉండి తన పార్లమెంట్ పరిధిలోనిది కావడంతో దీనిపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు అక్కడి సమస్యను పరిష్కరించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ అందరం మంత్రి మోపిదేవితో చర్చించి ఏకాభిప్రాయంతో ఛైర్మన్ ఎంపిక ప్రక్రియను పూర్తిచేస్తామనన్నారు. ఇంతలో అక్కడి కార్యకర్తలు జగన్ నాయకత్వం వర్దిల్లాలి.. రఘురామ కృష్ణంరాజు నాయకత్వం వర్దిల్లాలని నినాదాలు చేసారు. అలాగే జిల్లామంత్రి అయిన చెరుకువాడ రంగనాథరాజు నాయకత్వం వర్ధిల్లాలని ఓ కార్యకర్త నినాదాలు చేయడంతో ఎంపీ ఒకింత అసహనానికి లోనయ్యారు. ఆగవయ్యా.. మాట్లాడుతున్నా కదా.. ఎవడి నాయకత్వం కావాలి..  నోరు మూసుకు కూర్చో కాసేపు అంటూ పార్టీ కార్యకర్తలపై మండిపడ్డారు.

అయితే జనసేన, టీడీపీ శ్రేణులు ఈవీడియోను ట్రోల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి న్యాయకత్వాన్ని రఘురాజు తిట్టారంటూ షేర్లు చేస్తున్నారు. ప్రస్తుతం రఘురాజు పార్టీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాట్లాడుతుండా మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఎవరికైనా సహజంగా కోపం వస్తుంది.. పోనీ సదరు మంత్రితో రఘురాజుకు విభేదాలు ఉండొచ్చు. కానీ బాధ్యతాయుతమైన పదవిలో ఉండడంతోపాటుగా మీడియా ముందు ఉన్నామనే విషయాన్ని గమనించుకోవాలని, ఇప్పటికే పార్టీతో, ముఖ్యమంత్రితో ఉన్న గ్యాప్ చాలదనక ఈ వివాదాలు, ఆగ్రహాలు ఎందుకు రఘురామా అంటూ ఆయన సన్నిహితులు సలహాలిస్తున్నారు.

Show comments