iDreamPost
iDreamPost
2022 సంక్రాంతికి ముందు డేట్ లాక్ చేసుకున్న సినిమాల్లో రాధే శ్యామ్ ప్రధానమైనది ప్లస్ మొదటిది. ఆ తర్వాతే సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ ప్రకటనలు వచ్చాయి. సరే వీళ్లంతా మాటకు కట్టుబడి ఖచ్చితంగా ఆ డేట్ కే రిలీజ్ చేస్తారా లేదా అనేది ఇప్పుడే మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. కానీ తాజాగా ఆర్ఆర్ఆర్ కూడా పండగ బరిలో దిగుతుందనే ప్రచారం ముగ్గురు హీరోల ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తోంది. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ అభిమానులు వసూళ్ల మీద ఇలాంటి పోటీ తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ అఫీషియల్ అప్ డేట్ ఇప్పటిదాకా రాలేదు.
నిన్న రాధే శ్యామ్ మేకర్స్ మరోసారి జనవరి 14 తేదీని కన్ఫర్మ్ చేస్తూ సోషల్ మీడియాలో పాత పోస్టర్నే మళ్ళీ సర్కులేట్ చేశారు. అంటే ఆర్ఆర్ఆర్ వచ్చినా రాకపోయినా మేము మాత్రం మారే ప్రస్తక్తే లేని డైరెక్ట్ గా చెప్పేశారు. ఈ నేపథ్యంలో నిన్న అనౌన్స్ మెంట్ ఇవ్వాలనుకున్న ఆర్ఆర్ఆర్ నిర్మాతలు పునరాలోచనలో పడినట్టు సమాచారం. నిజానికి ఈ మల్టీ స్టారర్ ని వేసవికి వాయిదా వేయాలన్న కష్టమే. ఇప్పటికే ఏడాది క్రితం అడ్వాన్సులు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్లు ఒత్తిడి చేస్తున్నారు. మళ్ళీ అయిదారు నెలలు పోస్ట్ పోన్ అంటే వడ్డీలు పెరుగుతాయి. పైగా కరోనా సంగతి అంతుచిక్కడం లేదు. అందుకే పండక్క రావాలని అడుగుతున్నారట.
ఇదొక్కటే కాదు తమిళ మలయాళ హిందీ హక్కులు కొన్న ప్రొడ్యూసర్లు కూడా ప్రెజర్ చేయడం మొదలుపెట్టారని ట్రేడ్ టాక్. సో ఒకవేళ తప్పని పరిస్థితిలో రాధే శ్యామ్ ఆర్ఆర్ఆర్ క్లాష్ కనక కన్ఫర్మ్ అయితే బాక్సాఫీస్ వద్ద చరిత్రలో చాలా అరుదుగా చూసే సునామి వస్తుంది. అప్పుడు పవన్ మహేష్ లు రేస్ నుంచి తప్పుకునే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికైతే ప్రమోషన్ల విషయంలో ఆర్ఆర్ఆర్ కంటే రాధే శ్యామ్ వెనుకబడి ఉన్న మాట వాస్తవం. ఇంకా ఒక్క లిరికల్ వీడియో కూడా రిలీజ్ కాలేదు. దసరా నుంచి స్టార్ట్ చేసేలా ప్రణాళికలు వేసుకున్నారట. మొత్తానికి రాధే శ్యామ్ టీమ్ కాన్ఫిడెన్స్ స్పష్టంగా కనిపిస్తోంది
Also Read : ఏపీ ప్రభుత్వాన్ని మేమే కోరాం..పవన్ వ్యాఖ్యలతో సంబంధం లేదు – తేల్చేసిన నిర్మాతలు..