iDreamPost
android-app
ios-app

Pushpa Collections : పుష్ప కలెక్షన్స్ రిపోర్ట్ : రెండో రోజూ అక్కడ రికార్డు!

Pushpa Collections : పుష్ప కలెక్షన్స్ రిపోర్ట్ : రెండో రోజూ అక్కడ రికార్డు!

అల్లు అర్జున్, రష్మికా మందన్నా హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రా అండ్ రస్టిక్ సినిమా పుష్ప. శుక్రవారం నాడు భారీ అంచనాల మధ్య విడుదలైన పుష్ప పార్ట్ 1 టాక్ కొంత మిక్స్ గానే వచ్చింది. అయితే టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా ఈ సినిమా నైజాంలో సెన్సేషనల్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. సరిగ్గా విడుదలకు ఒక్కరోజు ముందు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఒక అదనపు షో పర్మిషన్, టికెట్ రేట్ల పెంపు అవకాశాన్ని వాడుకుని కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు సమాచారం మేరకు పుష్ప మొదటి రెండు రోజు అన్ని భాషలకు కలిపి సుమారు 58 కోట్ల దాకా షేర్ వసూలు చేసినట్లు తెలిసింది.

అత్యధికంగా నైజామ్ లో 18. కోట్ల 84 లక్షలు రాబట్టింది. డే వన్ ఆల్ టైం రికార్డు బద్దలు కొట్టింది అనుకుంటే, డే 1,2 రెంటికి కలిపి కూడా రికార్డులు బద్దలు కొట్టి టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇప్పటి దాకా నైజాంలో బాహుబలి కూడా ఈ సినిమా కంటే తక్కువ కలెక్షన్స్ రాబట్టింది. సినిమా టికెట్ల ధర పెంపు అంశం బాగా కలిసొచ్చింది. తమిళనాడులో కూడా సినిమా పుంజుకుంది. మొదటి రెండు రోజులు అక్కడ 3.05 కోట్లు సంపాదించింది. ఇక మొత్తం మీద రెండు రోజుల కలెక్షన్స్ ఏరియా వారీగా చూస్తే సీడెడ్ లో 6.22 కోట్లు, గుంటూరు 2కోట్ల 83 లక్షలు, ఉత్తరాంధ్ర 3 కోటి 5 లక్షలు, కృష్ణ 1 కోటి 92 లక్షల దాకా రాబట్టింది. కేవలం తెలుగు రాష్ట్రాల వరకు తీసుకుంటే షేర్ 38 కోట్ల దాకా రాబట్టింది. కర్ణాటక సోలోగా 4 కోట్ల 9 లక్షల దాకా వచ్చింది. అయితే ఇదంతా అధికారిక సమాచారం కాదు కాదు కానీ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మొత్తంగా 144 కోట్ల 90 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి 146 కోట్ల దాకా అవసరమవుతాయి.

కానీ అది చేరుకోవడం కొంచెం కష్టం అయిన పనే. ఎందుకంటే సినిమా హిట్ స్టేటస్ సాధించాలి అంటే 87 కోట్ల 10 లక్షలు సాధించాలి. పుష్ప నెగటివ్ ట్రెండ్ ని దాటుకుని నిలబడితే తప్ప ఇంత కలెక్షన్లు సాధించడం కష్టం. హిందీ వెర్షన్ రెండో రోజు మంచి రైజ్ కనిపించింది. మొదటి రోజు 3 కోట్ల పై చిలుకు వసూలు చేయగా రెండో రోజు 4 కోట్లు వసూలు చేసింది. మలయాళంలో మొదటి రోజు ప్రింట్ ఆలస్యమైనా మధ్యాహ్నం నుంచి షోలు పడేలా డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు కృషి చేయడంతో రెండు రోజులు కలిపి అక్కడ కూడా నాలుగు కోట్లు సాధించింది. ఇక ఈరోజు తో వీకెండ్ ముగియనుండడంతో రేపటి నుంచి వచ్చే వీక్ డేస్ కల్కేశంస్ సరళి పరిశీలిస్తే కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఆశల గురించి మాట్లాడలేం. చూడాలి ఈ సినిమా అంచనాలు ఏమేరకు అందుకుంటుంది అనేది.

Also Read : Ravi Teja In AHA : రవితేజతో బాలకృష్ణ ‘వార్’.. ఆహా ముగించేసిందిగా!

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetmadridbetmeritbetMarsbahis GirişCasibom Girişmeritbet