iDreamPost
android-app
ios-app

కొత్త సీఎం కు సమయం తక్కువ.. సవాళ్లు ఎక్కువ..

కొత్త సీఎం కు సమయం తక్కువ.. సవాళ్లు ఎక్కువ..

పంజాబ్ కొత్త సీఎంకు అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. సీఎం గా చరణ్ సింగ్ చన్నీ తనదైన మార్క్ చూపేందుకో లేదా మళ్లీ పార్టీని గెలిపించేందుకు దోహదపడే ప్రజారంజక పాలన అందేంచేందుకు సమయాభావం సమస్యగా మారింది. ఎందుకంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అంటే గట్టిగా ఆరునెలల సమయం మాత్రమే ఉంది. అందులో ఎలక్షన్ కోడ్ ప్రకటిస్తే ఆ సమయం మరింత తగ్గిపోయి కేవలం మూడు, నాలుగు నెలలకే పరమితం కానుంది.

ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత CMO పై పట్టు సాధించేందుకు సగం కాలం సరిపోతుంది. రోజు వారీ ఫైళ్లపై సంతకాలతోనే సీఎం సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. సీఎం అభ్యర్థి మార్పుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు లాభం జరుగుతుందో లేదో తెలియదు కానీ కొత్త సీఎం మాత్రం షార్ట్ టైమ్ లో బెస్ట్ ఫార్మర్ గా నిలదొక్కుకోవాల్సిన పరిస్థితి.

తక్కువ సమయంలో పాలనా పరమైన వ్యవహారాల్లో పట్టుసాధించడానికే సరిపోతుంది. తననను సీఎం పదవి నుంచి తప్పించడంపై అసంతృప్తిగా ఉన్న అమరిందర్, ఆయన మద్దతుదారులను బుజ్జగించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. రాజీవ్ గాంధీ స్కూల్ మేట్ అయిన అమరిందర్ ది ప్రత్యేక శైలి. అంత తేలికగా ఎదుటివారి మాటాలకు కన్విన్స్ అయ్యే నేచర్ కాదు. కాంగ్రెస్ ను వీడి ప్రత్యేక రాజకీయ పార్టీ నెలకొల్పి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరిన చరిత్ర ఆయనకు ఉంది.

కాంగ్రెస్ లో రేగిన చిచ్చును ఆర్పేందుకు హైకమాండ్ తీసుకున్న నిర్ణయంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు అనివార్యమైంది. పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ముఖ్యమంత్రి అమరిందర్ మధ్య ఏర్పడిన వర్గపోరు తీవ్రంకావడంతో హైకమాండ్ దిద్దుబాటు చర్యలు చేపట్టి కొత్త సీఎంను ఎంపిక చేసింది. కాంగ్రెస్ తీసుకున్న ఈ సాహోసేపత నిర్ణయం వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు మేలు చేస్తుందదో తెలియాలంటే మరో ఆరు నెలలు వేచి చూడాల్సిందే.

చరణ్‌జిత్ సింగ్ చన్నీ పంజాబ్‌కు తొలి దళిత ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కబోతున్నారు. రామ్‌దాసియా సింగ్‌ సామాజికవర్గానికి చెందిన చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ.. చమ్‌కౌర్‌సాహెబ్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చన్నీ.. 2015–16 మధ్య పంజాబ్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా పని చేశారు. కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ కేబినెట్‌లో.. సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

Also Read : పంజాబ్‌ కొత్త సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ