iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్‌లోకి సోనూసూద్ సోదరి..?

కాంగ్రెస్‌లోకి సోనూసూద్ సోదరి..?

సోనూసూద్.. ఈ పేరుకి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కరోనా కాలంలో ఎంతో మందికి సాయాలు చేసి రియ‌ల్ హీరోగా కీర్తించ‌బ‌డ్డాడు. అద్భుతమైన నటనతో పాటు కొవిడ్‌ సమయంలో విశేష సేవాకార్యక్రమాలతో ప్రజల ఆదరణ పొందిన నటుడు సోనూ సూద్ రాజ‌కీయాల్లోకి వస్తారని చాలా సార్లు ప్రచారం జరిగింది. కానీ గత నవంబర్‌లో ఆయన నుంచి అనూహ్య ప్రకటన వెలువడింది. సోనూ సోదరి మాళవిక రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు.

అయితే.. ఏ పార్టీ నుంచి అనేది ప్రకటించ లేదు.తాజాగా ఆమె పోటీ చేయబోయే పార్టీపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.ఆమె గతంలోనే పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీతో భేటీ అయ్యారు. ఆ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్‌లోకే వెళతారా? అన్న ప్రశ్నకు సోనూ అప్పట్లో సమాధానం దాటవేశారు.

ఇదిలా ఉండగా… ఆయన తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తాను పంజాబ్‌ ‘స్టేట్‌ ఐకాన్‌’గా ఉండబోనని సోనూసూద్‌ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. పంజాబ్‌ ఎన్నికల్లో భాగంగా​ ఎన్నికల సంఘం గతేడాది సోనూసూద్‌ను ‘స్టేట్‌ ఐకాన్‌’గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన సోదరి మాళవిక సూద్‌ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన స్టేట్‌ ఐకాన్‌ హోదా నుంచి తప్పుకున్నారు.

‘స్టేట్‌ ఐకాన్‌గా నా ప్రయాణాన్ని ముగిస్తున్నా.

స్వచ్ఛందంగా తాను ‘స్టేట్‌ ఐకాన్‌’ పదవి నుంచి వైదొలుగుతున్నా.ఎన్నికల సంఘంతో చర్చించి సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నా.నా సోదరి పంజాబ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు’ అని సోనూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల 2022 తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ సుశీల్ చంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేసి తేదీలను ప్రకటించారు.

ఐదు రాష్ట్రాల్లో ఏడుదశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది.అదే సమయంలో పంజాబ్‌లో ఒకే దశలో పోలింగ్ జరగనుంది.ఓటింగ్ ప్రక్రియ 14 ఫిబ్రవరి 2022న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ’పంజాబ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటనపై కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఉంటారని ఆయన స్పష్టం చేశారు.