iDreamPost
iDreamPost
సంక్రాంతి సినిమాల విడుదల రచ్చ ఆగలేదు. భీమ్లా నాయక్ పదే పదే జనవరి 12కి వచ్చే తీరతామని ప్రకటనలు గుప్పిస్తుండటంతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ రంగంలోకి దిగినట్టు సమాచారం. ఇవాళ మీటింగ్ జరిపి పవన్ నిర్మాతలతో పాటు ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ అధిపతులను కూర్చోబెట్టి ఓ నిర్ణయం తీసుకునే దిశగా ప్లాన్ చేసుకున్నట్టు తెలిసింది. ఓవరాల్ టార్గెట్ మాత్రం భీమ్లా పోస్ట్ పోనే అని తెలుస్తోంది. అయితే దీనికి నాగ వంశీ చినబాబులు ఒప్పుకుంటారా లేదానేది అనుమానమేనని ఇన్ సైడ్ న్యూస్. తక్కువ థియేటర్లు దొరికినా పర్లేదు పవన్ మూవీ లాంగ్ రన్ తో నిలబడి లాభాలు ఇస్తుందనే గట్టి నమ్మకంతో వాళ్ళు ఉన్నారని వినికిడి.
నిజానికి ఇలా రెండు మూడు సినిమాలు రావడం వింతేమీ కాకపోయినా రెండు పాన్ ఇండియా చిత్రాలు బరిలో ఉండటం వల్లే అసలు సమస్య వచ్చింది. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్ల మీద విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. స్క్రీన్లు తక్కువ ఉన్న చోట్ల ఒకరికి ఎక్కువ షోలు వేసి మరొకరికి తక్కువ వేస్తే అభిమానులతో లేనిపోని తలనెప్పులు వస్తాయి. అందుకే సర్దుబాటు చేసుకునే దిశగా చర్చలు జరుపుతారని తెలిసింది. అసలు అందరికన్నా ఆలస్యంగా డేట్ ని ప్రకటించిన ఆర్ఆర్ఆర్ ని అందరూ ఎందుకు వెనకేసుకు వస్తున్నారనే ప్రశ్నకు సమాధానం ఈ డిస్కషన్ లోనే దొరికే ఛాన్స్ ఉంది. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ రెండు రోజులుగా జరుగుతోంది.
ఇంతకీ పవన్ మనసులో ఏముందో బయటికి రావడం లేదు. ముందు తేదీ ప్రకటించింది తన సినిమానే అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ గ్రాండియర్ దానికి రావలసిన రీచ్ ని పరిగణనలోకి తీసుకుంటే భీమ్లా నాయక్ కు ఖర్చు పెట్టిన బడ్జెట్ ని ఏ సీజన్ లో అయినా రాబట్టుకోవచ్చు. కానీ ఆర్ఆర్ఆర్ కు అది అంత ఈజీ కాదు. గత సంక్రాంతి రావడం వల్లే అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరూ, దర్బార్ లు జయాపజయాలు పక్కనపెడితే వాటి స్థాయికి మించి వసూళ్లను తెచ్చుకున్నాయి. మాములు టైంలో ఇంత సాధ్యం కాదు. ఆర్ఆర్ఆర్ కు ఇలాంటి సీజన్ తోడైతే నేషన్ వైడ్ వందల కోట్లకు సులభంగా రాబట్టుకోవచ్చు. మరి గిల్డ్ ఈ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెస్తుందా లేదా మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అని ముగ్గురిని వదిలేస్తుందా సాయంత్రం లోగా తేలిపోవచ్చు
Also Read : Jai Bhim Suriya : హీరోలను కొడితే డబ్బు.. కొట్టడం అంతా ఈజీనా?