iDreamPost

మా అమ్మ కల నెరవేరింది.. రింకూ సింగ్ భావోద్వేగం!

  • Author Soma Sekhar Published - 03:30 PM, Fri - 18 August 23
  • Author Soma Sekhar Published - 03:30 PM, Fri - 18 August 23
మా అమ్మ కల నెరవేరింది.. రింకూ సింగ్ భావోద్వేగం!

రింకూ సింగ్.. ఐపీఎల్ 2023 సీజన్ లో మారుమ్రోగిపోయిన పేరు. అద్భుతమైన పవర్ హిట్టింగ్ తో కోల్ కత్తా టీమ్ కు విజయాలను అందించి.. ఏకంగా టీమిండియాలోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం టీమిండియా మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఐర్లాండ్ లో పర్యటిస్తోంది. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ డబ్లిన్ వేదికగా శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లు సీనియర్లందరికి విశ్రాంతినిచ్చి.. యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇచ్చారు. 2023 ఐపీఎల్ సీజన్ లో అదరగొట్టిన యువ ఆటగాళ్లకు జట్టులో స్థానం కల్పించారు. యువ సంచలనం రింకూ సింగ్ తో పాటుగా జితేశ్ శర్మలకు జట్టులో చోటు దక్కింది. ఈ క్రమంలోనే జట్టులో చోటు దక్కించుకున్న రింకూ సింగ్ భావోద్వేగమైన పోస్ట్ షేర్ చేశాడు.

ఐర్లాండ్ తో జరగనున్న మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ కోసం టీమిండియా ఐర్లాండ్ లో ల్యాండ్ అయ్యింది. ఇక ఈ సిరీస్ లో సీనియర్లకు విశ్రాంతిని ప్రకటించారు సెలక్టర్లు. దీంతో యంగ్ ప్లేయర్లకు మంచి అవకాశం లభించింది. వారిలో నయా యువ సంచలనం రింకూ సింగ్, జితేశ్ శర్మ, తిలక్ వర్మ, జైశ్వాల్ లకు ఈ సిరీస్ లో చోటు కల్పించారు. అయితే తిలక్ వర్మ, జైశ్వాల్ ఇప్పటికే విండీస్ టూర్ తో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టగా.. రింకూ సింగ్, జితేశ్ శర్మలు తమ ఎంట్రీ కోసం ఎదురుచూశారు.

కాగా.. దాదాపు 11 నెలల తర్వాత టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అదీకాక ఈ సిరీస్ కు బుమ్రానే టీమిండియాకు సారథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే భారత జట్టు బుధవారం ఐర్లాండ్ కు చేరుకుంది. అయితే టీమిండియాకు ఎంపికైన రింకూ సింగ్, జితేశ్ శర్మలు తొలిసారి బిజినెస్ క్లాస్ విమానంలో ప్రయాణించారు. కాగా.. వీరిద్దరు తమ తొలి ఇంటర్నేషనల్ పర్యటనకు సంబంధించిన అనుభవాలను పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఆ వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

“టీమిండియాకు ఆడాలనేది ప్రతీ ఒక్క ప్లేయర్ కల. నేను నా గదిలోకి వెళ్లి.. నా పేరు, 35 నంబర్ ఉన్న జెర్సీని చూడగానే ఎమోషనల్ అయ్యాను. ఇక నేను టీమిండియాకు ఎంపికైనప్పుడు నా స్నేహితులతో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ విషయాన్ని వెంటనే నేను మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను. నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం మా అమ్మ. టీమిండియా తరపున ఆడాలన్నది మా అమ్మ కల. ఇప్పుడు మా ఇద్దరి కల నిజమైంది” అంటూ బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు.

ఇక మరో ఆటగాడు జితేశ్ శర్మ మాట్లాడుతూ..”టీమిండియాతో కలిసి విదేశాల్లో పర్యటించడం గొప్ప అనుభవం. నిజం చెప్పాలంటే నాకు ఈ సంతోషంలో మాటలు రావడం లేదు. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం అన్నది గౌరవం, బాధ్యత కూడా. నా సత్తా చూపించేందుకు ఇది సరైన అవకాశం. 100 శాతం టీమిండియాను గెలిపించడానికి కష్టపడతాను” అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఏ మేరకు ఈ ఇద్దరు ఆటగాళ్లు రాణిస్తారో మరికొన్ని గంటలు వేచిచూడాలి.


ఇదికూడా చదవండి: చరిత్ర సృష్టించిన చెన్నై సూపర్ కింగ్స్.. తొలి ఐపీఎల్ టీమ్​గా రికార్డు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి