iDreamPost
android-app
ios-app

కరోనాపై యద్ధం.. రంగంలోకి ప్రధమ పౌరుడు

కరోనాపై యద్ధం.. రంగంలోకి ప్రధమ పౌరుడు

కరోనా వైరస్‌కు కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు చేపడుతున్నాయి. దేశ ప్రజలను రక్షించేందుకు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. ప్రజలను ఆదుకునేందుకు ఉద్దీపన చర్యలు చేపట్టాయి. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ నియంత్రణకు అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమం అవ్వాలని ప్రధాని సహా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు.

కరోనాపై ఎవరి స్థాయిలో వారు యుద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం ఎలా ఉంది..? నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..? అనే అంశంపై దేశ ప్రధమ పౌరుడు రామ్‌నాద్‌ కోవింద్‌ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలసి ఈ సమావేశం నిర్వహించిన రాష్ట్ర పతి దేశంలో కరోనా ప్రభావంపై సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలును అడిగి తెలుసుకున్నారు.

గవర్నర్లు, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్ల నుంచి సమాచారం తెలుసుకున్న రాష్ట్రపతి కరోనా వైరస్‌ అరికట్టేందుకు పలు సూచనులు, సలహాలు ఇచ్చారు. యుద్ద ప్రాతిపదికన వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. ప్రజలకు నిత్యవసరాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఇతర దేశాలతో పోల్చుకుంటే దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం భారీగా లేకున్నా.. రోజు రోజుకి పాజిటివ్‌ కేసులు పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ రోజుకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు 724కు చేరుకోగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వచ్చే నెల 14వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో అప్పటిలోగా వైరస్‌ వ్యాప్తి ఆగిపోతుందని ప్రభుత్వాలు ఆశిస్తున్నాయి.