iDreamPost
android-app
ios-app

PRC, CM YS Jagan – సీఎం చేతిలో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగుల్లో ఉత్కంఠ..

PRC, CM YS Jagan – సీఎం చేతిలో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగుల్లో ఉత్కంఠ..

ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న పీఆర్‌సీ తుది దశకు వచ్చింది. పీఆర్‌సీపై ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ తన నివేదికను కొద్దిసేపటి క్రితం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి అందించింది.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ సీఎం వైఎస్‌ జగన్‌కు నివేదిక అందించారు.

ఈ నెల 3వ తేదీన వరద బాధితులను పరామర్శించే సమయంలో తిరుపతిలో ఉద్యోగులు పీఆర్‌సీ విషయం సీఎం దృష్టికి మరోసారి తీసుకెళ్లారు. ఆ సమయంలో పీఆర్‌సీ సిద్ధమైందని, మరో పది రోజుల్లో ప్రకటిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు. చెప్పినట్లుగానే పది రోజుల్లో ఈ విషయాన్ని తేల్చబోతున్నారు.

పీఆర్‌సీ నివేదిక సిద్ధం కావడంతో ఫిట్‌మెంట్‌ ఎంత ఉంటుందనే అంశంపై ప్రస్తుతం ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై ఉద్యోగుల్లో జోరుగా జరుగుతోంది. మరికొద్ది సేపట్లో సీఎస్‌ సమీర్‌ శర్మ.. మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ సమావేశంలో పీఆర్‌సీకి సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

పీఆర్‌సీ నివేదిక ఇవ్వాలని ఉద్యోగులు కొన్ని రోజులుగా డిమాండ్‌ చేస్తున్నారు. నివేదిక తమకు ఇచ్చిన తర్వాత ప్రకటన చేయాలని కోరుతున్నారు. మరికొన్ని ఉద్యోగ సంఘాలు ఫిట్‌మెంట్‌పై ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే ప్రకటన చేయాలని కోరుతున్నాయి.

కాగా, పోరుగు రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం ఫిట్‌మెంట్‌ 30 శాతం ఇచ్చింది. దాన్ని ఆధారంగా చేసుకుని ఉద్యోగులు ఏపీలో ఫిట్‌మెంట్‌ ఎంత ఉంటుదనే అంచనాలు వేసుకుంటున్నారు. తెలంగాణ ప్రకటించిన ఫిట్‌మెంట్‌ కన్నా.. ఏపీలో ఎక్కువగానే ఉంటుందనే ప్రచారం సాగుతోంది.

Also Read : పొంచి ఉన్న ప్రమాదం.. ఎదుర్కొనేందుకు సిద్ధమైన సీఎం జగన్‌