Idream media
Idream media
మన్సిపల్ ఎన్నికల్లోనూ ఫ్యాన్ జోరు కనిపిస్తోంది. ప్రత్యర్థులకు అందనంత స్పీడుతో ఫ్యాన్ తిరుగుతోంది. మున్సిపల్, నగరపంచాయతీల వార్డులు, నగరపాలక సంస్థల డివిజన్లలో భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ఫలితాలు ఏకపక్షంగా వస్తున్నాయి. ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైసీపీ దూసుకుపోతోంది.
ప్రకాశం జిల్లాలో…
ప్రకాశం జిల్లాలో ఒంగోలు నగరపాలక సంస్థకు, మార్కాపురం, చీరాల మున్సిపాలిటీలకు, అద్దంకి, కనిగిరి, చీమకుర్తి, గిద్దలూరు నగరపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి.
కనిగిరి నగర పంచాయతీలో 20 వార్డులు ఉండగా ఏడు వార్డులను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మిగతా 13 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 13 వార్డులను వైసీపీ గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది.
గిద్దలూరు నగర పంచాయతీలో 20 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 16 వార్డులు వైసీపీ గెలుచుకుంది. టీడీపీ మూడు వార్డుల్లో గెలిచింది. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. నగరపంచాయతీ వైసీపీ కైవసం చేసుకుంది.
Also Read : నేడు పుర ఫలితాలు.. అందరిలోనూ ఉత్కంఠ..
చీమకుర్తి నగర పంచాయతీని వైసీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ 20 వార్డులు ఉండగా.. 14 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఆరు వార్డుల్లో ఎన్నికలు జరగ్గా.. నాలుగు వైసీపీ, రెండు టీడీపీ గెలుచుకున్నాయి. మొత్తం మీద వైసీపీ 18 వార్డులను కైవసం చేసుకోగా.. టీడీపీ రెండు వార్డులకు పరిమితమైంది.
అద్దంకి నగరపంచాయతీలో 20 వార్డులు ఉండగా.. 19 వార్డులకు ఎన్నికలు జరిగాయి. హోరాహోరీగా సాగిన పోరులో వైసీపీ 12 వార్డులు, టీడీపీ 7 వార్డులను గెలుచుకున్నాయి. రెబల్ అభ్యర్థులను తట్టుకుని మొత్తం 13 వార్డులను గెలుచుకున్న వైసీపీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది.
చీరాల మున్సిపాలిటీలో హోరాహోరీ పోరు నెలకొంది. ఇక్కడ 33 వార్డులు ఉండగా.. మూడు వార్డులను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మిగిలిన 30 వార్డులకు పోటీ జరిగింది. వైసీపీలోని రెండు వర్గాల మధ్య పోటీ నెలకొంది. ఎమ్మెల్యే కరణం బలరాం మద్ధతుదారులకు వైసీపీ బీఫాం దక్కగా.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు రెబల్స్‌గా పోటీలో నిలిచారు.
మార్కాపురం మున్సిపాలిటీలో 35 వార్డులు ఉండగా ఐదు వార్డులను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. 30 వార్డులకు ఎన్నికలు జరిగాయి.
ఒంగోలు నగరపాలక సంస్థలో 50 డివిజన్లు ఉండగా ఒక డివిజన్‌ను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మిగతా 49 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. మొదటి రౌండ్ ముగిసే సరికి.. 17 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. 3 డివిజన్లను టీడీపీ గెలుచుకుంది. ఇంకా 29 డివిజన్ల ఫలితాలు రావాల్సి ఉంది.
Also Read : గొట్టిపాటిని నిరాశపరిచిన అద్దంకి
నెల్లూరు జిల్లాలో..
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కోర్టు కేసుల వల్ల నెల్లూరు నగర పాలక సంస్థకు ఎన్నికలు జరగలేదు. ఆత్మకూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి మున్సిపాలిటీలకు, నాయుడు పేట నగర పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. నాయుడు పేట నగర పంచాయతీని వైసీపీ కైవసం చేçసుకుంది. ఇక్కడ 25 వార్డులు ఉండగా.. 23 వార్డులను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. టీడీపీ, బీజేపీలు ఒక్కొక్క వార్డు చొప్పన గెలుచుకున్నాయి.
సూళ్లూరుపేట మున్సిపాలిటీలో వైసీపీ గెలుపు లాంఛనమే అయింది. ఇక్కడ 25 వార్డులు ఉండగా 13 వార్డులను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఆత్మకూరు మున్సిపాలిటీలో 23 వార్డులకు గాను ఆరు వార్డులను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచకుంది. మిగతా 17 వార్డులకు ఎన్నికలు జరిగాయి. వెంకటగిరి మున్సిపాలిటీలో 25 వార్డులుండగా వైసీపీ మూడు వార్డులను ఏకగ్రీవంగా గెలుచుకుంది. 22 వార్డులకు పోలింగ్ జరిగింది.
Also Read : మొదలైన కౌటింగ్.. గుండెపోటుతో అభ్యర్థి మృతి..