iDreamPost
android-app
ios-app

ప్రశాంత్ నీల్ కోసం ఇండియన్ బాక్సాఫీస్ హీరోలు.. ఈ ఒక్క ఫోటో చాలు థియేటర్లు దద్దరిల్లడానికి..

  • Published Jun 04, 2022 | 7:00 PM Updated Updated Jun 04, 2022 | 7:00 PM
  • Published Jun 04, 2022 | 7:00 PMUpdated Jun 04, 2022 | 7:00 PM
ప్రశాంత్ నీల్ కోసం ఇండియన్ బాక్సాఫీస్ హీరోలు.. ఈ ఒక్క ఫోటో చాలు థియేటర్లు దద్దరిల్లడానికి..

KGF సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ ప్రభంజనం సృష్టించాడో అందరికి తెలిసిందే. KGF రెండు పార్టులతో బాక్సాఫీస్ ని షేక్ చేసి పాన్ ఇండియా డైరెక్టర్ గా నిలిచాడు. ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ప్రశాంత్ నీల్ ఒకడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. అంతేకాక ఎన్టీఆర్ తో కూడా సినిమా అనౌన్స్ చేశాడు.

ఇవాళ (జూన్ 4) ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు అవడంతో ప్రస్తుతం సలార్ షూటింగ్ లో ఉండగా సలార్ చిత్ర యూనిట్ మధ్య ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఈ వేడుకకి ప్రభాస్, యశ్ ఇద్దరూ ప్రశాంత్ కోసం హాజరవ్వడం విశేషం. దీంతో ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఇద్దరు హీరోలు డైనమేట్ లాంటి డైరెక్టర్ పక్కన నిలబడి ఫోటోలు దిగడంతో ఈ ఫోటోలు చూడటానికి రెండు కళ్ళు చాలట్లేదు అంటున్నారు అభిమానులు.

ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇంకొంతమంది అయితే ప్రశాంత్ డైరెక్షన్ లో వీళ్ళిద్దరితో కలిసి మల్టీస్టారర్ ప్లాన్ చేస్తే అదిరిపోతుంది, థియేటర్లు దద్దరిల్లిపోతాయి అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్, యశ్, హోంబలే ఫిలిమ్స్ అధినేత, సలార్ చిత్ర యూనిట్ మధ్య ఈ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అలాగే వీటితో పాటు KGF2 రిలీజ్ అయి ఇటీవల 50 రోజులు పూర్తి చేసుకోగా ఈ సెలబ్రేషన్స్ ని కూడా నిర్వహించారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetmeritbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom