iDreamPost
android-app
ios-app

Salaar: ప్రభాస్ సినిమా ఈ కారణంతో షూటింగ్ ఆలస్యం, స‌లార్ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

  • Published Aug 07, 2022 | 3:18 PM Updated Updated Aug 07, 2022 | 3:20 PM
  • Published Aug 07, 2022 | 3:18 PMUpdated Aug 07, 2022 | 3:20 PM
Salaar: ప్రభాస్ సినిమా ఈ కారణంతో షూటింగ్ ఆలస్యం, స‌లార్ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

సలార్‌ ప్లాన్ రిలీజ్ ప్లాన్ మొత్తం మారింది. కొత్త టైమ్‌లైన్ ప్రకారం సాలార్ షూటింగ్ మొద‌లైతే ప్రభాస్ ఈ తేదీకి ముందే షూటింగ్ కంప్లీట్ చేసుకొంటుంది. వచ్చే ఏడాది పెద్ద పండ‌గ‌కు విడుద‌ల కానుంది.

సలార్‌ మీద పెద్ద బెట్టింగ్ న‌డుస్తోంది. అటు ప్ర‌భాస్, ఇటు ప్ర‌శాంత్ నీల్ క్రేజ్ ను క‌లెక్ష‌న్స్ లో లెక్క‌వేస్తే ఈజీగా వెయ్యికోట్లు దాటే సినిమా. కాబ‌ట్టి, నిర్మాత‌లు జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేస్తున్నారు. సాలార్ నిర్మాతల ప్ర‌కారం, ఈ డిసెంబర్ నాటికి మొత్తం షూటింగ్ పూర్తికావాలి. కాని, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (Telugu Film Chamber of Commerce), తెలుగు నిర్మాతల మండలి( Telugu producers Council) సంయుక్త నిర్ణయం ప్ర‌కారం టాలీవుడ్ బంద్ న‌డుస్తోంది. హీరోలు, ఆర్టిస్ట్ ల రెమ్యునిరేష‌న్లు, థియేట‌ర్ రిలీజ్ కు OTT విడుదల మధ్య విండోపై ఏకాభిప్రాయం వ‌చ్చేవ‌ర‌కు అన్ని షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్ణయించారు. ఇప్పుడు ఈ బంద్, టీమ్ సలార్ ప్లాన్స్ ను దెబ్బ‌తీసింది. ప్రభాస్, శ్రుతి హాసన్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెలాఖరులో లేదా బహుశా సెప్టెంబర్ మొద‌టివారంలో ప్రారంభంకానుంది. కాని ఒక‌టే కండీష‌న్. ఈలోగా టాలీవుడ్ బంద్ ను ఎత్తివేయాలి.

ఒక‌వేళ సెప్టెంబ‌ర్ నుంచి కొత్తగా ప్లాన్ చేసిన టైమ్‌లైన్ ప్రకారం సలార్‌ షూటింగ్ మొద‌లైతే, KGF ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కు, షూటింగ్ ను కంప్లీట్ చేయాలంటే కనీసం 7-8 నెలలు ప‌డుతుంది. అంటే స‌లార్ మార్చి 2023 లోపు కంప్లీట్ కాదు. దానికున్న రేంజ్, భారీ బడ్జెట్ బ‌ట్టి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేయడానికి ప్ర‌శాంత్ నీల్ కు మ‌రో 4-5 నెలల సమయం పడుతుంది. ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం, ప్రభాస్ మూవీ దసరా 2023 నాటికి విడుదలవుతుంది. నిజానికి పాన్ ఇండియా సినిమాకు ఇదే క‌రెక్ట్ డేట్ కూడా. సౌత్ ఈ డేట్ కి భారీగా పోటీ ఉంటుంది. కాని నార్త్ లో పెద్ద‌గా పోటీ ఉండ‌దు. ఇప్ప‌టివ‌ర‌కు ద‌స‌రాకు వ‌చ్చే సినిమాలేవీ లేవు. కనీసం ఆమేర‌కు విడుద‌ల ప్ర‌క‌ట‌న‌లు లేవు. సో, స‌లార్ కి ద‌స‌రాయే బెస్ట్.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio