iDreamPost
iDreamPost
కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ క్యాబినేట్ మీటింగ్ అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి జన గణనకు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(NPR) పేరున కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు జనాభా లెక్కల ప్రక్రియ జరుగుతుందని, దీనికి ఎటువంటి పత్రాలు చూపవలసిన అవసరంలేదని, బయొమెట్రిక్ సెల్ఫ్ డిక్లరెషన్ ప్రక్రియతో జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి చెస్తామని చెప్పుకొచ్చారు. 2015లో ఇంటింటి సర్వే నిర్వహించి దానిని మళ్ళీ సమీకరణ చేయటం జరిగిందని, 10 ఏళ్ళకి ఒకసారి ఇది జరిగే ప్రక్రియే అని 2010లో అప్పటి యు.పి.ఏ ప్రభుత్వం నిర్వహించి 10ఏళ్ళు గడచిపోవటంతో ఇప్పుడు మళ్ళీ జనాభా లెక్కలు చేపడుతున్నాం అని చెప్పుకొచ్చారు.
అయితే ఈ ప్రక్రియ దేశం మొత్తం అమలు చేస్తాం కానీ అస్సాం ఒక్క రాష్ట్రానికి మినహాయింపు ఇస్తునట్టు చెప్పారు. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ పేరున సేకరించే ఈ వివరాలను 2021 కి వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు. ఈ సర్వే కోసం 8,754.23 కోట్లు ప్రభుత్వం వెచ్చించబోతుందని , 3,941.35 కోట్లు సమీకరణకు ఉపయోగించబోతునట్టు చెప్పుకొచ్చారు. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కు – వివాదాస్పదమైన యన్.ఆర్.సికి మధ్య ఎటువంటి సంబంధం లేదని యన్.ఆర్.పి 1955 నుండి ఉన్న చట్టం అని చెప్పుకొచ్చారు.