Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో మాటల ద్వారా మంటలు రేపి ప్రతిపక్ష పార్టీ ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీపై ప్రతిపక్షంలో ఉన్నవారు.. విమర్శించడం.. తప్పుబట్టడం.. ప్రభుత్వ పథకాలపై విరుచుకుపడడం సర్వసాధారణం. అయితే.. దీనికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి. హద్దులు దాటితే ఆందోళనలు చెలరేగక తప్పవని తాజా పరిస్థితులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిరసన దీక్షకు దిగుతున్నారు.నిన్నటి బంద్ పేవలంగా ముగిసింది…మరి నేటి నిరసన దీక్షలు సక్సెస్ అవుతాయా అంటే అదీ అనుమానమే…ఇది కూడా ఫెయిల్యూరే అనచ్చు..నిజానిజాలు జనాలకు తెలియపరిచేందుకు వైసీపీ కూడా జనాగ్రహం పేరుతో దీక్షలకు సిద్ధమవుతోంది. దీంతో రాజకీయాలు ఆసక్తిగా మారాయి.
సమయం, సందర్భంగా లేకుండా ప్రభుత్వంపైనా, నేరుగా ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ప్రతిపక్ష నేతలకు పరిపాటిగా మారింది. మహిళా హోం మంత్రి సుచరితపై కూడా పలు సందర్భాల్లో నోరు పారేసుకున్న దాఖలాలు ఉన్నాయి. సమయం.. సందర్భం లేని అలాంటి వ్యాఖ్యలను చంద్రబాబు అదుపు చేసి ఉంటే పరిస్థితులు ఇలా మారబోయేవి కాదని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పుడు దీక్ష ద్వారా ఏం సాధించనున్నారనేది చూడాలి. టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడికి నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్షను చేపట్టబోతున్నారు. నేటి ఉదయం 8 గంటల నుంచి ఎల్లుండి రాత్రి 8 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ధ్వంసమైన సామగ్రి మధ్యే ఆయన దీక్షకు దిగనుండడంతో పోలీసులు వర్గాలు అప్రమత్తమయ్యాయి.
మరోవైపు రెండు రోజుల పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా జనాగ్రహ దీక్షలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడం ఆసక్తిగా మారింది. టీడీపీ బూతుల వ్యాఖ్యలకు నిరసనగా నియోజకవర్గ స్థాయిలో రెండు రోజుల పాటు నిరసనలు చేయనున్నట్లు తెలిపారు. బూతు వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో ఈ జనాగ్రహ దీక్షలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. , పట్టాభి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
రాజకీయంగా ఎలా ఉన్నా.. పోలీసులు అధికారులు కూడా టీడీపీ నేత పట్టాభి మాట్లాడింది.. చాలా దారుణ భాష అని పేర్కొంటున్నారు.
రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నవారిపై దుర్భాషలాడటం సరికాదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ‘‘పట్టాభి వ్యాఖ్యల తర్వాత ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఒక పార్టీ కార్యాలయంలో కూర్చుని ఇంత దారుణంగా మాట్లాడటం సరికాదు. ఇలాంటి భాషను సమాజంలో ఎవరూ అంగీకరించరు. పట్టాభి మాట్లాడిన భాష గతంలో ఎన్నడూ వినలేదు. రాజకీయ పార్టీలకు బాధ్యత ఉండాలని డీజీపీ హితవు పలికారు. నిన్న పట్టాభి చేసిన వ్యాఖ్యలు అన్ని పరిధులు దాటాయి. ఒక్కసారి కాదు.. పదేపదే పట్టాభి దూషణలు చేశాడు. పట్టాభి వ్యాఖ్యలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తాం. గత కొన్ని రోజులుగా చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తాం. దీని వెనుక ఎలాంటి కుట్ర ఉన్నా దర్యాప్తులో బయటపెడతాం.. అని చెప్పారు. దీన్ని బట్టి త్వరలో నిజానిజాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: TDP Bandh – ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే పేలవమైన బంద్ బాబు హస్తిన టూర్ కి అడ్డంకులు కల్పిస్తుందా