Idream media
Idream media
ఒకప్పుడు ప్రభుత్వం నుంచి స్థలం రావడం అంటే ఓ పెద్ద కల. అలాంటిది ఈజీగా ఇల్లే కట్టి ఇస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో, లేదా సొంత స్థలంలో అప్పు తీసుకుని ఇల్లు కట్టుకుని, ఆ అప్పు తీర్చలేక నేటికీ ఇంటి పత్రాలు పొందలేని వారికి స్వల్ప మొత్తంలో చెల్లించడం ద్వారా వారి అప్పును మాఫీ చేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకున్న వారికి రిజిస్ట్రేషన్ కూడా చేసేస్తున్నారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు జనం గుండెల్లో జగన్ గూడు కట్టుకునేలా చేస్తున్నాయి.
ఆనందంలో లబ్ధిదారులు
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్) పై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం తెగ బాధపడిపోతోంది. పేదలకు సంపూర్ణ హక్కు కల్పిస్తుంటే లేనిపోని దుష్ప్రచారాలు చేస్తోంది. ఎవరూ డబ్బులు కట్టొద్దంటూ ప్రచారం చేస్తోంది. ఎందుకంటే.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా చేసేస్తారట. పద్నాలుగేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ విషయం ఎందుకు గుర్తుకు రాలేదో వారికే తెలియాలి. అధికారంలోకి వస్తామో, రామో తమకే తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు హామీలు మాత్రం కురిపించేస్తున్నారు. రుణాలు పొంది ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో, సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న పలువురు నేటికీ పత్రాలు పొందలేక దశాబ్దాలు తరబడి పేదలు ఇబ్బంది పడుతున్నారు. ఓటీఎస్ పథకం వారికి ఎంతో ఊరటనిచ్చింది. వేలల్లో ఉన్న రుణాల్ని కొద్ది మొత్తంలో చెల్లింపులు చేసి రిజిస్ట్రేషన్ పత్రాల్ని పొందే అవకాశాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కల్పించింది. దీనివల్ల బ్యాంకులు ఇతర సంస్థల్లో రుణాలు పొందేందుకు అవకాశం లభిస్తోందని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : CM YS Jagan – మిగిలిన రెండున్నరేళ్లు.. జగన్ లక్ష్యాలు ఇవే..
చేతిలో పత్రంతో ధీమా
“ఉన్న ఆస్తి ఈ ఒక్క ఇల్లు మాత్రమే. పదిహేనేళ్ల కిందట ప్రభుత్వం నుంచి రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకున్నాం. ఇల్లు ఉన్నా అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే బ్యాంకు, ఇతర సంస్థల్లో రుణం పొందలేకపోయాం. ఆర్థిక ఇబ్బందులు వచ్చినపుడు రుణం కోసం బ్యాంకుకు వెళితే ఇంటిపై ఇంకా రూ. 27 వేల అప్పు ఉందని చెప్పి ఇవ్వలేదు. కానీ నేడు కొద్దిపాటి చెల్లింపుతో నాకు రుణం తీరిపోయి సొంత పత్రాలు చేతికి వచ్చాయి. ఇప్పుడు అత్యవసర సమయంలో బ్యాంకు, లేదా ఎక్కడైనా రుణం పొంది ఇబ్బందుల నుంచి బయటపడగలనని ధైర్యం వచ్చింది.” అని ప్రకాశం జిల్లా తురకపాలేనికి చెందిన కొరివి దీనమ్మ ఆనందం వ్యక్తం చేసింది.
రుణం కోసం కాళ్లు అరిగేలా తిరిగా ..
“నాకున్న ఆస్తి ఇల్లు మాత్రమే. కూలీ నాలీ చేసుకుని బతికేవాళ్లం. ఇరవై ఏళ్ల కిందట ప్రభుత్వం నుంచి రుణం పొంది ఇల్లు నిర్మించుకున్నా. తరువాత అదే ఇంటిపై రుణాలు పొందాలన్నా పొందే పరిస్థితి లేకపోయింది. ఇల్లు ఉన్నా లేనట్టేనన్నట్లు తయారైంది. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా కొద్దిపాటి చెల్లింపుతో సొంత పత్రాలు పొందవచ్చని స్థానిక సచివాలయంలో తెలిపారు. దీంతో గతంలో రుణం రూ. 16 వేలు ఉంటే దానిని తగ్గించి రూ. 5400 చెల్లించి సొంత పత్రాలు పొందాను. ఇప్పుడు నాకు సొంత ఇంటి పత్రాలున్నాయి. ఎక్కడైనా అత్యవసర సమయంలో రుణం పొందవచ్చని ధైర్యం వచ్చింది.” అని మరో లబ్ధిదారుడు జక్రయ్య పేర్కొన్నాడు.
ఇలా వేలాది మంది జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్) పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు ఉన్నప్పటికీ పత్రాలు లేకపోవడంతో సొంతమనే భావన ఉండేది కాదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు చేతుల్లో పెట్టడం తో కూలీ నాలీ చేసుకుని జీవిస్తున్న ఆయా కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. తమకూ ఆస్తి ఉందని, అవసరానికి ఉపయోగపడుతుందనే ధీమా పెరిగిందని పేర్కొంటున్నాయి. ఒకవైపు జగనన్న కాలనీలు, మరోవైపు గృహ హక్కు పథకాలు పేదలకు ఎంతో మేలు చేస్తున్నాయి.
Also Read : TDP, Andhra Jyothi, Rosaiah, YS Jagan – రోశయ్య మరణాన్ని కూడా వాడుతున్నారు.. వీళ్ళు మారరా..?