iDreamPost
android-app
ios-app

కాళ్ళ కంటే, కళ్ళకే ప్రాధాన్యత: పూజా హెగ్దే

కాళ్ళ కంటే, కళ్ళకే ప్రాధాన్యత: పూజా హెగ్దే

అందాల భామ పూజా హెగ్దే పేరు చెప్పగానే, ముందుగా ఆమె కాళ్ళే గుర్తుకొస్తాయి. అంతలా, ఆమె కాళ్ళ చుట్టూ ఫోకస్‌ పెట్టేశాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ‘అల వైకుంఠపురములో’ సినిమా కోసం. ఆ ‘కాళ్ళ’ గ్లామర్‌ బాగా వర్కవుట్‌ అవడంతో, అఖిల్‌ కొత్త సినిమా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’కి కూడా ఆ కాళ్ళతోనే ప్రమోట్‌ చేసేస్తున్నారు. ఇక ముందు కూడా పూజా హెగ్దే కాళ్ళ మీద ఫోకస్‌ పెట్టి చాలా సినిమాలు రాబోతున్నాయంటూ సినీ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇంతకీ, ఆ కాళ్ళ గ్లామర్‌ సీక్రెట్‌ ఏంటి.? అని ప్రశ్నిస్తే, ‘‘నేనెప్పుడూ ఫిట్‌గా వుండడానికి ప్రయత్నిస్తాను. ఎప్పుడూ ఫిట్‌గానే వుంటాను కూడా. ప్రత్యేకించి కాళ్ళను అందంగా చూపించాలని ఏమీ అనుకోవట్లేదు. ‘అల వైకుంఠపురములో’ కోసం దర్శకుడు అలా సీన్స్‌ రాసుకున్నారంతే..’’ అని చెప్పిన పూజా హెగ్దే, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ లుక్‌ కోసం అనుకోకుండా అలా సెట్టయ్యిందని వివరణ ఇచ్చింది. కాళ్ళ కంటే, నేను కళ్ళనే నమ్ముతానని కూడా క్లారిటీ ఇచ్చేసింది. నటన ప్లస్‌ గ్లామర్‌.. ఈ రెండూ వుంటేనే హీరోయిన్‌గా సక్సెస్‌ అవ్వొచ్చనీ, గ్లామర్‌కి తానేం వ్యతిరేకం కాననీ, గ్లామరస్‌ ప్రపంచంలో అందంగా కన్పించడం తప్పేమీ కాదనీ, గ్లామర్‌తోపాటు, పెర్ఫామెన్స్‌ ఓరియెంటెడ్‌ పాత్రలకి తాను ఎక్కువ ప్రాధాన్యతనిస్తాననీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజా హెగ్దే ప్రభాస్‌ సరసన ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తోన్న విషయం విదితమే. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో పనిచేసే అవకాశం రావడం మెమరబుల్‌ ఎక్స్‌పీరియన్స్‌ అని అంటోంది పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్దే.