iDreamPost
android-app
ios-app

సూర్య ఓటు కూడా ఓటిటికేనా

  • Published Apr 25, 2020 | 11:24 AM Updated Updated Apr 25, 2020 | 11:24 AM
సూర్య ఓటు కూడా ఓటిటికేనా

ఇప్పుడంటే కొంచెం మార్కెట్ డౌన్ అయ్యింది కానీ స్టార్ హీరో సూర్యకు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇతని తాజా చిత్రం ఆకాశమే నీ హద్దురా ప్రస్తుతం కరోనా వల్ల విడుదల వాయిదా పడింది. ఇది థియేట్రికల్ రిలీజ్ కే కట్టుబడ్డారు కాబట్టి ఓటిటిలో రాదు కానీ సూర్య నిర్మాణంలో రూపొందిన మరో చిత్రం మాత్రం థియేటర్లకు ఇప్పట్లో అవకాశం లేదు కాబట్టి నేరుగా డిజిటల్ రిలీజ్ కాబోతోందని చెన్నై హాట్ న్యూస్. భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో తనే నిర్మాతగా 2డి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ మీద ఫ్రెడ్రిక్ దర్శకత్వంలో రూపొందించిన ‘పొన్మగళ్ వంతాల్’ ని అతి త్వరలో అమెజాన్ ప్రైమ్ ద్వారా డైరెక్ట్ గా విడుదల చేసే నిర్ణయం దాదాపు జరిగిపోయిందట.

జ్యోతిక లాయర్ గా టైటిల్ రోల్ పోషించిన ఈ మూవీలో భాగ్యరాజ్, పార్తీబన్, ప్రతాప్ పోతన్ లాంటి సీనియర్లు ఇతర సపోర్టింగ్ రోల్స్ లో నటించారు. క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ డబ్బింగ్ రూపంలో తెలుగులో కూడా అందుబాటులో ఉంచుతారట. ఈ మధ్య ఇలాంటి చిత్రాలు ప్రైమ్ లో బాగానే పలకరిస్తున్నాయి. మరో రెండు మూడు ఇతర సినిమాలు కూడా ఇదే దారిలో ఓటిటి వైపే చూస్తున్నట్టు సమాచారం. మన టాలీవుడ్ లోనూ ఆ దిశగా చర్చలు ఊపందుకున్నాయి. అందులో మొదటగా అమృతారామమ్ 29న ఆన్ లైన్లోకి వస్తున్న సంగతి తెలిసిందే.

ఒకవేళ లాక్ డౌన్ కనక వచ్చే నెలలోనూ పొడిగించి థియేటర్ల ఓపెనింగ్ కి అనుమతి ఆలస్యం చేస్తే మరిన్ని సినిమాలు ఓటిటి ఆప్షన్ ఎంచుకోవడం ఖాయమే. కేవలం భారీ స్టార్ హీరోల చిత్రాలు మాత్రం హోల్డ్ లో పెడతారు. మే 5 తర్వాత దీనికి సంబంధించిన క్లారిటీ రావొచ్చని ఇండస్ట్రీ పెద్దల అంచనా. అందరూ ఇళ్లలోనే ఉండాల్సిన తరుణంలో డిజిటల్ స్ట్రీమింగ్ సైట్స్ కి విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. దానికి తగ్గట్టే ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన కొత్త సినిమాలన్నీ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. భీష్మ కూడా ఇవాళ అడుగుపెట్టింది. చూస్తుంటే పరిణామాలు ఏ దిశగా మలుపు తిరుగుతాయో అంతు చిక్కడం లేదు