iDreamPost
android-app
ios-app

ట్రయాంగిల్ పోటీలో పవన్ సినిమా

  • Published Aug 03, 2021 | 4:54 AM Updated Updated Aug 03, 2021 | 4:54 AM
ట్రయాంగిల్ పోటీలో పవన్ సినిమా

రోజుకో ప్రకటనతో 2022 సంక్రాంతి పోరు అప్పుడే వేడెక్కుతోంది. ఇప్పటికే సర్కారు వారి పాట, రాధే శ్యామ్ లు జనవరి 13, 14 తేదీలను లాక్ చేసుకోగా నేనేం తక్కువా అనే రీతీలో పవన్ కళ్యాణ్ నేను సైతం అంటూ తన భీమ్లా నాయక్(ప్రచారంలో ఉన్న టైటిల్)ని జనవరి 12నే విడుదల చేయబోతున్నట్టు ప్రకటించడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అంటే మూడు రోజులు వరసగా టాలీవుడ్ బాక్సాఫీస్ ఊచకోతను చూడబోతోందన్న మాట. ఈ ముగ్గురూ రేంజ్ పరంగా నువ్వా నేనా అనే స్థాయి కావడంతో వసూళ్ల అంచనాలు ఊహకు అందటం లేదు. కాకపోతే ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ కాస్త ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకోవడం మాత్రం వాస్తవం.

ఇంతకీ ఈ మూడు సినిమాలు మాట మీద ఖచ్చితంగా ఉంటాయా అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి . ఎందుకంటే కరోనా పుణ్యమాని ఏదీ మన చేతుల్లో లేకుండా పోయింది. ఇప్పుడు ముందు తేదీల మీద కర్చీఫ్ వేసి పెట్టుకుంటే ఆ టైంకంతా పరిస్థితి నార్మల్ అయిపోతే కనక యథావిధిగా ప్రొసీడ్ అవ్వొచ్చు. లేదూ ఏదైనా తేడా వచ్చిందనుకుంటే ఎలాగూ వాయిదా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జనమే అర్థం చేసుకుంటారు. రానున్న రోజుల్లో పాన్ ఇండియా మూవీస్ మధ్య విపరీతమైన పోటీ నెలకొనబోతున్న నేపథ్యంలో నిర్మాతలు సేఫ్ గా ఈ ముందస్తు గేమ్ ఆడేందుకు రెడీ అయ్యారు.

ఇక్కడితో ఆట అయిపోలేదు. వెంకటేష్ వరుణ్ తేజ్ ల ఎప్గ్3 కూడా సంక్రాంతికేనని క్లారిటీ వచ్చేసింది. అయితే 10 లోపున వస్తుందా లేక 11, 12 తీసుకుంటుందా అనేది ఆసక్తికరం. ఇంత కాంపిటీషన్ ఎందుకు అనుకుంటే వాయిదా తీసుకోవచ్చు. కానీ గతంలో ఎఫ్2 కూడా ఇలాంటి పోటీ మధ్యే గెలిచిన సంగతి మర్చిపోకూడదు. ఇవే అనుకుంటే తాజాగా ఆచార్య కూడా ఇదే బరిలో దిగొచ్చనే వార్తలు నిన్న సాయంత్రం నుంచి చక్కర్లు కొడుతున్నాయి. అయినా నవంబర్ డిసెంబర్ విడుదల గురించి ఎవరూ మాట్లాడ్డం లేదు కానీ ఇంకా చాలా టైం ఉన్న జనవరి మీద ఇంతగా దండయాత్ర జరగడం విశేషమే

Also Read: వెంకటేష్ సైలెన్స్ అందుకేనేమో