iDreamPost
android-app
ios-app

రాష్ట్రాన్ని ఊపేస్తున్న ఖమ్మం రాజకీయం! ఇక్కడే అసలు ఫైట్!

  • Published Oct 18, 2023 | 3:27 PM Updated Updated Oct 18, 2023 | 3:27 PM
రాష్ట్రాన్ని ఊపేస్తున్న ఖమ్మం రాజకీయం! ఇక్కడే అసలు ఫైట్!

తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి కనిపిస్తుంది. గల్లీ లీడర్ల నుంచి ఢిల్లీ లీడర్ల వరకు తెలంగాణలో హడావుడి చేస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ స్వయంగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నేటి నుంచి కాంగ్రెస్ కూడా ప్రచారం ముమ్ముం చేయనుంది. సాయంత్రం ములుగు నుంచి జాతీయస్థాయి నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ‘బస్సు యాత్ర’ మొదలు పెట్టనున్నారు. మూడు రోజుల పాటు తెలంగాణలో 8 నియోజకవర్గాల్లో ఈ పర్యటన కొనసాగించనున్నారు. ఇక బీజేపీ సైతం ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఖారారు చేసి ఫస్ట్ లీస్ట్ రిలీజు చేసేందుకు సిద్దమౌతుంది. అయితే ఖమ్మంలో ఇటీవల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య గట్టి పోరు నడుస్తుందని అంటున్నారు. 2023 నేపథ్యంలో ఖమ్మంలో ఎవరి బలాలు ఎలా ఉన్నాయి.. ఎవరు జిల్లాను సొంతం చేసుకుంటారు అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

ఖమ్మంలో ప్రస్తుతం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒకటి ప్రాంతీయ బలమైతే.. మరొకటి జాతీయ బలం. రాబోయే ఎన్నికల నేపథ్యంలో రెండు ప్రధాన పార్టీలు తమ బలాబలాలు చూపించుకోవడానికి సరికొత్త వ్యూహాలతో సిద్దమవుతున్నాయి. మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతుంది. ఇందుకోసం ఈసారి ఖమ్మం జిల్లాపై హస్తం పార్టీ జెండాను ఎగరేయాలని ఇక్కడి నాయకులు గట్టి పట్టుమీదే ఉన్నారు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో అలుపెరుగని విధంగా ప్రజల్లో తిరుగుతున్నారు. దీనికి తోడు ఇటీవల ఖమ్మం సీనియర్ నేతలు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో మరింత బలం చేకూరినట్లయ్యింది.

 మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఖరారు చేసి బీ-పామ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రచారం కూడా ముమ్మరం చేస్తున్నారు. రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న తమకు మూడవసారి ఛాన్స్ ఇస్తే తెలంగాణ మరింత అభివృద్ది పధంలోకి తీసుకువెళ్తాం అని బీఆర్ఎస్ అంటుంది. బీఆర్ఎస్ తరుపు నుంచి  ఖమ్మం లో అజయ్ కుమార్ పువ్వాడ, పాలేర్ లో కందాల ఉపేందర్ రెడ్డి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇక అధికార పార్టీకి థీటుగా కాంగ్రెస్ ఎన్నికల కార్యాచరణంలో తన దూకుడు కొనసాగిస్తుంది. ఇదే నియోజకవర్గాల్లో మొదటి నుంచి పట్టు ఉన్న తుమ్మల, పొంగులేటి సైతం అధికార పార్టీ తీరు ని విమర్శిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాదు బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్న నేతలను తమవై లాగే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఖమ్మంలో కీలక నేతలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణను కాంగ్రెస్ లోకి ఆహ్వనించారు. ఆయన బాటలోనే బీఆర్ఎస్ నేతలు ఆర్ జేసీ కృష్ణ, కమర్తపు మురళీ ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు నియోజకవర్గాల్లో అసంతృప్తిలు, అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో ఉన్నారు ఆయా పార్టీల ముఖ్య నేతలు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తైతే.. ఖమ్మం జిల్లా రాజకీయా మరో లెవెల్ అంటున్నారు.. ఈ సారి గెలుపు బావుట ఎవరు ఎగుర వేస్తే.. భవిష్యత్ లో తమ ఆదిపత్యాన్ని కొనసాగించేందుకు వీలు ఉంటుందని ఇరు పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి. మొత్తానికి బీఆర్ఎస్ ఐక్యతారాగం.. కాంగ్రెస్ సమన్వయ తంత్రం.. ఈసారి ఎన్నికల్లో ఎంత వరకు పనిచేస్తాయో చూడాలి. మొత్తానికి ఖమ్మం రాజకీయాల్లో ఈ ఎన్నికలు ప్రత్యేకంగా నిలిచే అవరాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నాన్నారు. మరి ఖమ్మం జిల్లాలో ఎవరు జెండా ఎగురేస్తారో చూడాలి.