Idream media
Idream media
దశాబ్ధాల పోలవరం కల సాకారమవుతోంది. వరదలు వచ్చే సమయానికి స్పిల్ వేను పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని జగన్ సర్కార్ చేరుకోవడంతో అనుకున్న సమయానికి ప్రాజెక్టు పనులు పూర్తవుతాయనే నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కలుగుతోంది. వచ్చే నెల నాటికి 41 మీటర్ల వరకూ ముంపునకు గురయ్యే నిర్వాసితులకు పరిహారం చెల్లించి.. వారిని పునరావాస గ్రామాలకు తరలించేందుకు జగన్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్యమైన ముంపు పరిహార సమస్యకు పరిష్కారం లభించబోతోంది.
వడివడిగా అడుగులు..
పోలవరం సోమవారం పేరుతో ప్రాజెక్టు నిర్మాణంపై ప్రచారం ఎక్కువ.. పని తక్కువ చేసిన చంద్రబాబు సర్కార్‌కు భిన్నంగా.. జగన్ సర్కార్ వ్యవహరిస్తోంది. ప్రచార ఆర్భాటం లేకుండా వేగంగా పనులు చేస్తోంది. నిధుల సమస్యలను అధిగమిస్తూ.. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించలేదనే మాట లేకుండా ప్రాజెక్టును 2022 ఆఖరుకు పూర్తి చేయాలనే లక్ష్యంతో జగన్ సర్కార్ పని చేస్తున్నట్లు ఇప్పటి వరకు జరిగిన పనిని బట్టి తెలుస్తోంది. కరోనా సమయంలోనూ ప్రాజెక్టు పనులు నిర్విర్యామంగా సాగడం ప్రాజెక్టు పూర్తి చేయడంపై సీఎం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో పని పరుగులు పెట్టిందిలా..
– రివర్స్ టెండర్ల తర్వాత 2019 నవంబర్ 8న మేఘా ఇంజనీరింగ్ సంస్థకు పోలవరం నిర్మాణ పనులు దక్కాయి.
– 2019 నవంబర్ 21వ తేదీన ప్రాజెక్టు స్పిల్ వే బ్లాకు వద్ద కాంక్రీటు పనులతో పోలవరంలో మేఘా భాగస్వామ్యమైంది.
– 2020 ఫిబ్రవరి 17న స్పిల్ వే పిల్లర్లపై గడ్డర్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
– 2020 ఆగస్టు 19న వరద సమయంలోనూ స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ కాంక్రీట్ పనులు ప్రారంభమయ్యాయి.
– 2020 నవంబర్ 12 నాటికి రెండు లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి.
– 2020 డిసెంబర్ 17న స్పిల్ వే రేడియల్ గేట్ల అమరిక పనులు ప్రారంభం
– 2021 ఫిబ్రవరి 11నాటికి స్పిల్ వే లోని 52 పిల్లర్లు.. 52 మీటర్ల ఎత్తు నిర్మాణం పూర్తి.
– 2021 ఫిబ్రవరి 20న స్పిల్ వే పిల్లర్లపై 192 గడ్డర్లు అమరిక పూర్తి.
– 2021 ఫిబ్రవరి 22న స్పిల్ వే రేడియల్ గేట్లకు హైడ్రాలిక్ సిలిండర్ల అమరిక.
– 2021 ఫిబ్రవరి 26న స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం పనులు పూర్తి.
– 2021 మార్చి 25న స్పిల్ వే రేడియల్ గేట్ల ట్రయల్ రన్ విజయవంతం.
– 2021 మే 27వ తేదీన ఎగువ కాఫర్ డ్యాం అన్ని గ్యాపులు పూడ్చి వేత.
– 2021 జూన్ 11న అప్రోచ్ ఛానెల్ నుంచి స్పిల్ వే వైపునకు గోదావరి నది మళ్లింపు.
– 2021 జూన్ 23న గేట్లను ఎత్తి స్పిల్ వే ద్వారా నీరు దిగువకు విడుదల చేశారు.
Also Read : జగన్ పాలన గొప్పగా ఉంది.. బాబు మాటలతో ..