ఆకర్షణగా నిలిచిన ప్రధాని మోదీ తలపాగా.. ప్రత్యేకత ఇదే!

Narendra Modi: దేశంలోని వాడవాడలా నేడు 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ 11వ సారి జెండాను ఎగురవేశారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ధరించిన తలపాగా అందరిని ఆకర్షించింది.

Narendra Modi: దేశంలోని వాడవాడలా నేడు 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ 11వ సారి జెండాను ఎగురవేశారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ధరించిన తలపాగా అందరిని ఆకర్షించింది.

దేశ వ్యాప్తంగా 78వ స్వాతంత్ర్య దినోత్వస వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి చోట త్రివర్ణపతాకాలు రెపరెపలాడాయి. స్వాతంత్ర్య సమరయోధులు పోరాటల గురించి అందరూ స్మరించుకున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో జాతీయ జెండాను ఎగరేశారు. ఇక దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతకాన్ని ఎగరేశాడు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ డ్రెస్ అందరిని ఆకట్టుకుంది. అంతేకాక ఆయన ధరించిన తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ క్రమంలో ఆ తలపాగా గురించి తెలుసుకునేందుకు ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. మరి.. ప్రధాని మోదీ ధరించిన తలపాగా ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం…

భారత దేశ  ప్రధాని నరేంద్ర మోదీ 11వ సారి జాతీయ జెండాను ఎగరేశారు. మోదీ తాను తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కాలం నుంచి తాను మూడోసారి అధికారంలోకి వచ్చే వరకు ప్రతి ఏటా వేర్వేరు వస్త్రాధరణలో కనిపిస్తున్నారు. తలపాగాలు ధరిస్తూ కనిపించారు. ఈ ఏడాది ప్రధాని మోదీ తలపాగా చాలా ప్రత్యేకంగా, వెరైటీగా ఉంది. ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని మోదీ కాషాయ, ఆకుపచ్చు, పసుపు రంగులతో కూడిన రాజస్థానీ తలపాగాలో కనిపించారు. తెలుపు రంగు కుర్తా, పైజామాతో పాటు నీలిరంగు కోటు ధరించాడు.

ఇక మోదీ ధరించిన తలపాగాలో రకరకలా రంగులు ఉన్నప్పటికీ.. కాషాయ రంగు ఎక్కువగా కనిపిస్తోంది. ఈ కాషాయ వర్ణం శ్రీరామునికి ఎంతో ఇష్టమైన రంగుగా కొందరు పండితులు చెబుతుంటారు. ఆ ఉద్దేశంతోనే ఈ తలపాగా ధరించినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ  ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలో నూతన రామ మందిరాన్ని ప్రారంభించిన సంగతి తెలిసింది. దీంతో ఆ వేడుకకు గుర్తుగా..  ఇప్పుడు ఈ తలపాగా ధరించి..రామయ్యపై తనకున్న భక్తి చాటుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రధాని మోదీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతో ఆయన  11వ సారి జాతీయ జెండాను ఎగరేశారు. ఆయన కంటే ముందు అత్యధికంగా తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 17 సార్లు, ఇందిరా గాంధీ 16 సార్లు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరేశారు.

Show comments