iDreamPost
android-app
ios-app

వీడియో: జాతీయ జెండాను తీసి జేబులో పెట్టుకున్న ప్రధాని మోదీ..

వీడియో: జాతీయ జెండాను తీసి జేబులో పెట్టుకున్న ప్రధాని మోదీ..

జాతీయ జెండా  అంటే ప్రతి ఒక్కరి గౌరవం ఉంటుంది. అందుకే ఎక్కడైనా మన జాతీయా జెండా కనిపించినాసెల్యూట్  చేస్తారు. అంతేకాక జాతీయ జెండాకు ఏదైనా అవమానం జరిగితే… అసలు తట్టుకోలేరు. ఇలా కేవలం సామాన్యులే కాదు.. ప్రజాప్రతినిధులు కూడా ఉంటారు. అందుకే తరచూ కొందరు ప్రజాప్రతినిధులు జాతీయ జెండా విషయంలో ఏ చిన్న పొరపాటు జరగకుండా చూసుకుంటారు. తాజాగా ప్రధాని మోదీ సైతం జాతీయ జెండాపై తనకున్న గౌరవాన్ని ప్రదర్శించారు. కింద పడిన జాతీయ జెండాను తీసుకుని జేబులో పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌతాఫ్రికా రాజధాని జోహన్నెస్ బర్ లో పర్యటిస్తున్నారు. అక్కడ 15వ బ్రిక్స్ సదస్సులో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు మోదీ సౌతాఫ్రికా వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరించిన తీరు ప్రస్తుతం నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఎందుకంటే త్రివర్ణ పతాకానికి నరేంద్ర మోదీ ఇచ్చిన గౌరవం ఇప్పుడు ప్రశంసనీయంగా మారింది. ఈ సమావేశానికి ముందు గ్రూప్‌ ఫోటో దిగేందుకు బ్రిక్స్ దేశాల అధినేతలను స్టేజీ మీదకి పిలిచారు. అలానే భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పిలవగా.. ఆయన వేదికపైకి చేరుకున్నారు.

ఆ స్టేజీ మీద ఉన్న జాతీయ జెండా ఉండటాని ప్రధాని మోదీ గమనించారు. దీంతో స్జేజీపైన కాలు పెట్టకుండానే కిందికి వంగి మన జాతీయ జెండాను తీసుకున్నారు. అనంతరం ఆ త్రివర్ణ పతకాన్ని తీసుకుని తన జేబులో పెట్టుకున్నారు. అసలు స్టోరీ ఏంటంటే.. ఫోటో సెషన్ సమయంలో ఆయా దేశాలకు సంబంధించిన నేతలు నిలబడేందుకు వారి స్థానాల్లో వారి వారి జాతీయ జెండాలను ఉంచుతారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ నిలబడాల్సిన ప్రాంతంలో భారతీయ జెండాను ఉంచారు. అది చూసిన ప్రధాని మోదీ.. జెండా ఉన్న స్టేజీపై కాలు పెట్టకుండా..దాన్ని జేబులో పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే మోదీ అనుసరించి సౌతాఫ్రికా అధ్యక్షుడు సరిల్ రమాఫోసా కూడా స్టేజి ఎక్కారు.  ఆయన వారి జాతీయ జెండాను తీసుకుని.. పక్కనే ఉన్న తన సహాయకుడికి ఇచ్చారు. అయితే మోదీ మాత్రం తన  జౌబులోనే పెట్టుకున్నారు. ఈ సీన్ అక్కడ ఉన్నవారిని ఆకర్షించడంతో పాటు ప్రధాని మోదీ పై సోషల్ మీడియాలో కూడా నెటిజన్ల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరీ.. జాతీయ జెండ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు చిత్రాలివే!