iDreamPost
android-app
ios-app

సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై సుప్రీంలో పిల్

సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై సుప్రీంలో పిల్

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు, ఎంపి రాహుల్ గాంధీపై సుప్రీం కోర్టులో ఓ పిల్ దాఖలైంది. 2008లో కాంగ్రెస్ పార్టీకి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సిపిసి) మధ్య జరిగిన ఒప్పందం వివరాలను బహిరంగ పరచాలంటూ పిటిషనర్ వ్యాజ్యం దాఖలు చేశారు.

సావియో రోడ్రిగ్స్, శశాంక్ శంకర్ ఝా అనే వ్యక్తులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్‌కు, సిపిసికి మధ్య జరిగిన ఒప్పందంపై జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. భారత, చైనా మధ్య ఘర్షణాత్మక వైఖరి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది.  

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి చైనాతో రహస్య సంబంధాలు ఉన్నట్లు ఆయన ఆరోపించారు. రాజీవ్‌ ట్రస్ట్‌కు చైనా ఎంబసీ నుంచి నిధులు వచ్చాయని, చైనాతో రహస్య సబంధాలు ఉండడం వల్లే ఈ నిధులు వచ్చాయని ఆయన అన్నారు. వాస్తవానికి చైనా నిధులతోనే కాంగ్రెస్‌ పార్టీ నడుస్తోందని, కాంగ్రెస్‌ మేధావులు సైతం చైనా కోసమే పనిచేస్తున్నారని రవి శంకర్ ప్రసాద్ అన్నారు.

సోనియా గాంధీ,‌ రాహుల్ గాంధీపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయిన నేపథ్యంలో కేంద్ర మంత్రి రవి‌ శంకర్ ప్రసాద్ సంచలన ఆరోపణలు ‌చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పందించలేదు. కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.