Idream media
Idream media
వైఎస్ జగన్ సర్కార్ నాలుగు రోజుల కిందట రెండేళ్లు పూర్తి చేసుకుంది. 2019 మే 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల వేళ తాను ఇచ్చిన హామీలను ప్రమాణ స్వీకారం చేసే సమయంలో మరోమారు ప్రస్తావించిన సీఎం వైఎస్ జగన్ చెప్పినట్లు.. ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. రెండు పేజీలతో సుస్పష్టంగా వైసీపీ తన ఎన్నికల హమీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.
వైఎస్ జగన్ సర్కార్ పాలన ప్రారంభమైన మొదటి ఏడాది నుంచి నవరత్నాల పథకాల అమలుకు శ్రీకారం చుట్టింది. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పది నెలలకే కరోనా వైరస్ ప్రబలింది. దాని ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది. కరోనా వైరస్ వల్ల అనేక సమస్యలు చుట్టిముట్టినా, ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తినా.. వైఎస్ జగన్ ఇచ్చిన మాటను తప్పలేదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. ప్రతి హామీని అమలు చేశారు. మొదటి ఏడాదిలోనే 90 శాతం హామీలను అమలు చేసిన వైఎస్ జగన్.. రెండో ఏడాదిలో మరికొన్ని హామీలను ఆచరణలోకి తెచ్చారు. ఫలితంగా మేనిఫెస్టోలోని దాదాపు 95 శాతం హమీలు అమలయ్యాయి.
గత నెల 30వ తేదీన వైఎస్ జగన్ సర్కార్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ రెండేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు, వాటి వల్ల ఆయా వర్గాల ప్రజలు జరిగిన ఆర్థిక లబ్ధిని గణాంక సహితంగా పత్రికా ప్రకటనల ద్వారా ప్రజల ముందు ఉంచింది. సార్వత్రిక ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డ టీడీపీ పరిస్థితి రెండేళ్లలో ఏ మాత్రం మెరుగుపడకపోగా.. మరింత దిగజారిందని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమైంది. ఈ పరిణామాలతోపాటు.. తాజాగా రెండేళ్ల పాలనలో తాము చేసిన పనిని జగన్ సర్కార్ ప్రజలు ముందు పెట్టడడంతో.. టీడీపీలో దడ మొదలైంది.
సీనియర్‌నాయకుడైన చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. ఏ మాత్రం అనుభవం లేని వైఎస్ జగన్.. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం ప్రజలు గమనించారు. దీంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అబద్ధాలు చెబుతూ.. పత్రికలకు ప్రకటనలు ఇస్తూ వైసీపీ సర్కార్ ప్రజా ధనం దుర్వినియోగం చేస్తోందంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే ఈ విమర్శ సరిపోదని ఆలస్యంగా గుర్తించిన బాబు.. తన పార్టీ నేతలను రంగంలో దించారు.
వైసీపీ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ప్రజలు ఎవరూ సంతోషంగా లేరని, అసంతృప్తితో ఉన్నారంటూ మాజీ మంత్రులు ఆళ్లపాటి రాజా, కళా వెంకటరావు, నక్కా ఆనంద్‌బాబులు ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. ప్రభుత్వం వివిధ కులాల వారికి, వర్గాల వారికి ఎంత మేలు జరిగిందో చెప్పగా.. వాటిని ప్రస్తావిస్తూ… అవన్నీ అబద్ధాలేనంటూ నోటికి పని చెప్పారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వంలో కన్నా తమ ప్రభుత్వంలోనే ఆయా వర్గాల వారికి ఎక్కువ మేలు జరిగిందంటూ ఏకరువు పెట్టారు. అయితే ఎక్కువ మేలు జరిగితే.. ప్రజలు ఎందుకు టీడీపీకి ఓటేయలేదనే ప్రశ్న సాధారణంగానే ఉత్పన్నమవుతోంది.
Also Read : సుధాకర్, రఘురామరాజు.. ఇక జడ్జి రామకృష్ణ వంతు..!