Idream media
Idream media
ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులకు పట్టాభి మాటలతో ఆజ్యం పోయడమే కారణమని తేలడంతో దాని నుంచి బయటపడేందుకు టీడీపీ నేతలు కొత్త భాష్యాలు చెబుతున్నారు. పట్టాభి చేసిన కామెంట్లకు పయ్యావుల కేశవ్ కొత్త అర్థాలు చెబుతున్నారు. సాధారణంగా నాయకులు చేసుకునే విమర్శలకు.. పెద్దగా అర్థాలు వెతికే పరిస్థితి లేదు. ఎందుకంటే.. ఒకరిని మించి ఒకరు నాయకులు విమర్శలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు తిట్టుకున్నా.. హుందాగా ఉండేవి. కానీ ఇప్పుడు హద్దులు దాటేశారు. అధికారంలో ఉన్నవారు,లేనివారు కూడా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తున్నారు. నాలుగు గోడల మధ్య పరిమితం కావాల్సిన పదాలను బహిరంగంగా అనేస్తున్నారు.
పట్టాభి చేసిన కామెంట్లు రాష్ట్రంలో రాజకీయ రచ్చను సృష్టిస్తున్నాయి. పట్టాభి నోట వచ్చిన బూతులను మీడియా ద్వారా ప్రజలు అందరూ విన్నారు. ఆ మాటల తో కలత చెందిన కొందరు కార్యకర్తలు టీడీపీ కార్యాలయంపైకి దండెత్తడం.. ఆ తర్వాత టీడీపీ బంద్, చంద్రబాబు దీక్ష.. పట్టాభి బూతులకు నిరసనగా వైసీపీ జనాగ్రహ దీక్షలతో రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ఇదిలాఉండగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల ఎంటరై బోష్ డీకే అనే పదానికి కొత్త అర్థాన్ని చెబుతున్నారు. బోష్ డీకే గుజరాత్ లో ఓ గ్రామం ఉందని.. ఆ పదానికి అమాయకులు అని కూడా అర్థం ఉందని పయ్యావుల స్పష్టం చేశారు.
పట్టాభి చేసిన ఈ వ్యాఖ్య.. అనంతర పరిణామాలతో ఒక్కసారిగా .. అసలు బోష్ డీకే అంటే.. ఏంటి? దీని అర్థం ఏంటి? ఏయే సందర్భాల్లో అంటారు? అనే విషయాలు చాలా చాలా ఆసక్తిగా మారాయి. దీనికి సంబంధించి..నెటిజన్‌లు..గూగుల్‌లో ఈ ఏడాది చేసిన సెర్చ్ లో హైలెట్‌గా నిలిచిందని తాజాగా గూగుల్ ప్రకటించుకుంది. దీనిపై అంటే.. ఈ పదంపై భాషాశాస్త్రవేత్తలు కూడా దృష్టి పెట్టారు.
మనకు గూగుల్ ద్వారా తెలుస్తున్న సమాచారం మేరకు.. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో `బోషడీ` అనే గ్రామాలు ఉన్నాయి. ఇవి ఇప్పటికీ ఉన్నట్టు గూగుల్ మ్యాప్ చూపిస్తోంది. గతంలో బ్రిటీషర్ల కాలంలో ఈ గ్రామాలు రెండూ కూడా నిరక్షరాస్యులకు పెట్టింది పేరు. దీంతో ఆయా గ్రామాల నుంచి పట్టణాలకు పనుల నిమిత్తం ఎవరైనా వస్తే.. `బోష్డీకే వాలా ఆయేగా.. కామ్ దేదో!!“ అనే మాట వాడుకలోకి వచ్చినట్టు తెలుస్తోంది. కానీ కేశవ్ చెప్పినట్లు ఆ గ్రామం పేరు బోష్ డీకే కాదు.. బోషడీ గా తెలుస్తోంది. మిగతా రాష్ట్రాల్లో అర్థాలు ఎలాగున్నా, మన దగ్గర వాడుకలో ఉన్న వాటినే సాధారణంగా పరిగణనలోకి తీసుకుంటారు. కేశవ్ ఆ విషయాన్ని మరిచి ఇలా వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా మారింది.
Also Read : Remand Report – పట్టాభి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు