iDreamPost
android-app
ios-app

పవన్ వెనక్కు – వైష్ణవ్ ముందుకు

  • Published Aug 14, 2020 | 6:57 AM Updated Updated Aug 14, 2020 | 6:57 AM
పవన్ వెనక్కు – వైష్ణవ్ ముందుకు

లాక్ డౌన్ వల్ల షూటింగులే కాదు సినిమాల ప్లానింగులు కూడా మారుతున్నాయి. సమీప భవిష్యత్తులో ఎక్కువ జనంతో షూట్లు చేసే పరిస్థితి లేకపోవడంతో స్క్రిప్ట్ మార్చుకోవడమో లేదా పూర్తిగా పెండింగ్ లో పెట్టడమో చేస్తున్నారు. దర్శకుడు క్రిష్ ఇప్పుడు అదే బాటను ఎంచుకున్నారు. వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ తో చేయాల్సిన విరూపాక్ష(ప్రచారంలో ఉన్న టైటిల్)ని తాత్కాలికంగా హోల్డ్ లో పెట్టారు. భారీ సెట్టింగులు, అధికంగా జూనియర్ ఆర్టిస్టులు, క్రూ అవసరమున్న సెటప్ కావడంతో ఎందుకొచ్చిన రిస్క్ అని హీరోతో దర్శక నిర్మాతలు డిస్కస్ చేశాక ఫైనల్ గా పోస్ట్ పోన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

ఈలోగా క్రిష్ సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించి ఇవాళ పూజా కార్యక్రమాలు కూడా చేసేశారు. రెగ్యులర్ షూటింగ్ కూడా రేపటి నుంచే మొదలుపెట్టబోతున్నట్టు తెలిసింది. క్రిష్ తో పాటు సాయి బాబు, రాజీవ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తారు. సింగల్ షెడ్యూల్ లో పూర్తి చేసేలా పక్కా ప్లానింగ్ జరిగిపోయిందట. ఇది పవన్ ఫ్యాన్స్ కి నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత కన్నా మార్గం లేదు. కోర్ట్ రూమ్ డ్రామాగా నడిచే వకీల్ సాబ్ నే ఇంతవరకు రీ స్టార్ట్ చేయలేదు. అలాంటిది అంత భారీ కాన్వాస్ ఉన్న క్రిష్ మూవీని ఏ రకంగానూ మొదలుపెట్టే ఛాన్స్ లేదు.

వైష్ణవ్ తేజ్ సినిమా పూర్తి చేసి ప్రమోషన్లు ఓ కొలిక్కి తెచ్చి పనులు పూర్తి చేసేలోపు ఎంత లేదన్న ఐదారు నెలలు పడుతుంది. ఆలోగా వ్యాక్సిన్ రావడంతో పాటు కేసులు కూడా తగ్గిపోయి ఉంటాయి కాబట్టి ధైర్యంగా మళ్ళీ సెట్లు వేసుకోవచ్చు. దీనికి నిర్మాత ఏఎం రత్నం ఇప్పటికే కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు చేశారు. క్రిష్ ఒకవైపు వెబ్ సిరీస్ ల నిర్మాణ వ్యవహారాలు, సినిమాల పనులు చేసుకంటూ రెండు పడవల ప్రయాణాన్ని బాగానే సాగిస్తున్నారు. ఇక వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన ఇంకా ధియేటర్ల కోసం ఎదురు చూస్తూనే ఉంది. నాని వి తరహాలో డిజిటల్ లో వచ్చే ఉద్దేశమేది మైత్రి సంస్థకు లేదని సమాచారం. ఏది ఏమైనా కరోనా వల్ల ఏదీ మన చేతుల్లో లేని పరిస్థితి వచ్చేసింది