iDreamPost
android-app
ios-app

సంక్రాంతి లక్ష్యంగా పవర్ స్టార్

  • Published Jul 26, 2021 | 8:03 AM Updated Updated Jul 26, 2021 | 8:03 AM
సంక్రాంతి లక్ష్యంగా పవర్ స్టార్

గత ఏడాది లాక్ డౌన్ వల్ల వకీల్ సాబ్ కు బ్రేక్ పడినట్టే అచ్చం అదే తరహాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్ కూడా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇవాళ్టి నుంచి ఫ్రెష్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ఇందులో పవన్ కూడా ఎంటరయ్యాడు. ఇంకో నెల రోజులు షూటింగులకు రాకపోవచ్చని కొద్దిరోజుల క్రితం ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇప్పుడీ కీలక అప్ డేట్ రావడం అభిమానులకు గుడ్ న్యూసే. వకీల్ సాబ్ లాగే తక్కువ బడ్జెట్ లొకేషన్లలో తీసే సబ్జెక్టు కావడంతో దర్శకుడు సాగర్ చంద్ర వేగంగా పూర్తి చేసేందుకు పక్కా ప్లానింగ్ తో సిద్దమయ్యాడు. థర్డ్ వేవ్ లాంటి గండాలు ఏవీ రాకపోతే ఇంకో రెండు నెలల్లో గుమ్మడికాయ కొట్టేస్తారు

ఇందులో పవన్ కు జోడిగా నిత్య మీనన్ రానా భార్యగా ఐశ్వర్య రాజేష్ లు నటిస్తున్నారు. కానీ అధికారికంగా ఇంకా దీన్ని ప్రకటించలేదు. వాళ్ళు సెట్ లోకి ఎంటరయ్యాక అప్పుడు అనౌన్స్ చేస్తారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సముతిరఖని లాంటి సీనియర్ ఆర్టిస్టులు గట్టిగానే ఉన్నారు. ఒక పోలీస్ ఆఫీసర్, ఒక వాలంటరీ రిటైర్డ్ ఆర్మీ మేజర్ కు మధ్య జరిగే ఈగోల యుద్ధాన్ని నేపధ్యంగా తీసుకుని మళయాలంలో రూపొందిన ఈ కాన్సెప్ట్ ని తెలుగు ప్రేక్షకుల అభిరుచులు, అభిమానుల అంచనాలకు తగ్గట్టు త్రివిక్రమ్ కొన్ని కీలక మార్పులు చేశారు. కమర్షియల్ అంశాలకు లోటు లేకుండా చూసుకున్నారు

ఇక విడుదల కూడా 2022 సంక్రాంతికే ఉండొచ్చని అంటున్నారు. హరిహర వీరమల్లు వేసవికి ప్లాన్ చేసుకుని రెండు సినిమాలకు మధ్య ఆరు నెలల గ్యాప్ ఉండేలా సెట్ చేస్తున్నారట. ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు భీంలా నాయక్. సామజిక వర్గాన్ని కూడా గట్టిగానే ఫోకస్ చేసి పేరు సెట్ చేసినట్టు ఉన్నారు. పవన్ ని వెనుక నుంచి తీసిన ఫోటోలో పోలీస్ ఆఫీసర్ డ్రెస్ తో ఇందాకా ప్రీ లుక్ ని ఇందాకే రివీల్ చేశారు.మొత్తానికి తక్కువ బడ్జెట్ సినిమాలతో వంద కోట్లకు తక్కువ కాకుండా మార్కెట్ చేసుకుంటున్న పవన్ నిర్మాతలు మంచి లాభాలు చూస్తున్నారు. దీనికి బిల్లారంగాతో పాటు మరికొన్ని టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట

Also Read: చిరంజీవి డబుల్ బొనాంజా ఇస్తారా

Jojobet GirişmeritbetcasibomJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetgar girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel