Idream media
Idream media
ఒకప్పుడు కేఏ పాల్ మాటలకి విలువ ఉండేది. రానురాను వాగుడు ఎక్కువై చివరికి కామెడీగా మారిపోయాడు. పవన్‌కల్యాణ్ కూడా అదే దిశలో ప్రయాణిస్తున్నాడా అనే అనుమానం వస్తోంది. ఎందుకంటే నాయకుడికి విజ్ఞత కావాలి. అది లేనివాడు నాయకుడు కాలేడు. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం పవన్‌కి అలవాటైంది.
ఆయన అన్న చిరంజీవి కూడా పార్టీ పెట్టాడు. 18 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఎక్కువ కాలం రాజకీయాలు చేయలేకపోవచ్చు. కానీ ఎప్పుడూ విజ్ఞత కోల్పోయి మాట్లాడలేదు. కానీ పవన్‌కి విజ్ఞత ఎప్పుడూ లేదు.
ఆయన సినిమాల్లోంచి రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. జనసేన పార్టీ పెట్టారు. గ్రామస్థాయి కాదు కదా జిల్లాస్థాయి నాయకత్వాన్ని కూడా నిర్మించలేకపోయారు. అభిమానుల్నే కార్యకర్తలనుకుని మురిసిపోయాడు. సీఎం అని వాళ్లు అరిస్తే నిజమే అనుకున్నాడు. దూకుడు సినిమాలో బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణతో ఒక మాట అంటాడు. “నువ్వు హీరోవంటే ఎలా నమ్మావు?” అని.
పవన్ హీరోనే కానీ అభిమానుల అమాయకత్వం, అజ్ఞానం వల్ల జీరో అయిపోయాడు. అయితే 2014 ఎన్నికల్లో కెటలిస్ట్‌గా ఉపయోగపడ్డాడు. అంటే పాలు తోడుకోవడానికి ఒక చుక్క మజ్జిగ అవసరం. బాబు అధికారంలోకి రావడానికి ఇలా ఉపయోగపడ్డాడు.
చంద్రబాబుని ఐదేళ్లలో ఒక్కరోజు కూడా ప్రశ్నించకుండా మొన్నటి ఎన్నికల్లో బాబు వ్యతిరేక ఓటు జగన్‌కి పడకూడదని కృషి చేశాడు. అయితే జనం తెలివైన వాళ్లు.
Also Read : ఖబడ్ధార్ పవన్ కళ్యాణ్ : ఎమ్మెల్యే రాజాసింగ్
ఇప్పుడేమో జగన్‌ని తిడుతూ ఊళ్లు తిరుగుతున్నాడు. జగన్ తప్పులు చేస్తే విమర్శించు. అది ప్రజాస్వామిక హక్కు. మరి ఆరు నెలల్లో జగన్ చాలా మంచి పనులు చేశాడు కదా! అవి కళ్లకి కనిపించవా? ప‌్రతి మంచి పనికి మొదట్లో అడ్డంకులు ఉంటాయి.
ఎమ్జీఆర్ తమిళనాడులో మధ్యాహ్న భోజన పథకం పెట్టినప్పుడు ఖజానాని ఖాళీ చేస్తున్నాడని అందరూ విమర్శించారు. కానీ అది ఎంత మంచి పథకమో తర్వాత రుజువైంది. సమాజంలో అన్ని వర్గాలు బాగుండాలని జగన్ ఒక యుద్ధమే చేస్తున్నాడు. నిధుల లభ్యత అంటారా , ఆ మాత్రం ఆలోచన లేకుండానే సీఎం కుర్చీలో కూర్చున్నాడా?
Also Read : రాంగోపాల్‌వర్మకి పిచ్చి పాల్‌కి పిచ్చిన్నర
పాల్ మాటల్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోని పరిస్థితి లాగే పవన్ మాటలు కూడా వచ్చేరోజుల్లో ఎవరూ పట్టించుకోరు. ఇలా కాకుండా ఆయన నిర్మాణాత్మకంగా పార్టీని నిర్మించి చంద్రబాబు నీడలా కాకుండా సొంత వ్యక్తిత్వంతో వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో కనీస పోటీ అయినా ఇవ్వగలుగుతాడు.