వీడియో: నది మధ్యలో చిక్కకున్న 40 మంది ప్రయాణికుల బస్సు!

వీడియో: నది మధ్యలో చిక్కకున్న 40 మంది ప్రయాణికుల బస్సు!

ఇటీవల కొన్నిరోజుల నుంచి దేశావ్యాప్తంగా  భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర భారత దేశంలోని రాష్ట్రాలు అయితే ఈ వరదల ధాటికి చిగురాటాకుల వణికిపోతున్నాయి.  పలు ప్రాంతాలు నదులు, చెరువులను తలపిస్తున్నాయి. ఉత్తరాఖండ్ , హర్యానా,  జమ్ముకశ్మీర్, యూపీ, ఢిల్లీలో.. ఈ వరద సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. కొండ చరియాలు విరిగి పడి ఊర్ల మీద పడ్డాయి. బురదతో కూడిన వరద గ్రామాలు, పట్టణాలపై విరుచక పడింది. ఈ వరదల కారణంగా ఇప్పటికి  అనేక మంది  చనిపోయారు. అలానే అనేక వాహనాలు వరదల్లో  చిక్కుకున్నాయి.  వరదలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ని బిజ్నోర్ వద్ద ఉన్న కోటావలి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. కోటావాలి నది పై భాగాంలో ఉండే ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు భారీ వరద వచ్చి చేరింది. ఈ క్రమంలో నదిపై ఉన్న  రహదారిపై నీటి ప్రవాహం పెరిగింది.  ఈ క్రమంలో అటుగా 40 మంది ప్రయాణికులతో  బస్సు  బయలు దేరింది. అయితే  కోటావాలి నది వరద ప్రవాహంపై  సమాచార లోపంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్  అటుగా వెళ్లారు. ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరగడంతో 40 మంది ప్రయాణికులతో ఉన్న  బస్సు అందులో చిక్కుకుంది. ఈక్రమంలో స్థానికులు అందించిన సమాచారంతో అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

నదిలో చిక్కుకున్న బస్సును  జేసీబీల సాయంతో  ఒడ్డుకు లాగి ప్రయాణికులందరినీ రక్షించారు. కొన్ని రోజుల క్రితం కూడా ఓ బస్సు నది మధ్యలో చిక్కకుని ఉండగా.. అందులోని ప్రయాణికులు ప్రాణ భయంతో కేకలు వేశారు. అయితే నదిలో  చిక్కుకున్న బస్సును స్థానికులు గమనించి.. అందులోని ప్రయాణికులను కాపాడే  ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బస్సులోని ప్రయాణికులు, వారి బ్యాగులను నది నుంచి బయటకు తీసుకొచ్చారు. పలు ప్రాంతాల్లో వాహనాలు కూడా నది ప్రవాహంలో కొట్టుకుపోయాయి. తాజాగా యూపీలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ వరదపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భారీ వర్షం కూడా వారిని ఆపలేకపోయింది.. ఆడాళ్లు మీకు జోహార్లు!

Show comments