Idream media
Idream media
బినామీల పేరిట 6 ఎకరాలు ??
సీఐడీ దర్యాప్తులో వెల్లడి
అమరావతి రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం నాయకులు, వారి అనుయాయులు కొన్న భూముల చిట్టా తిరగేస్తున్నకొద్దీ కొత్తకొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 600 మంది తెల్లకార్డు దారులు వేల ఎకరాల భూములు కొన్నట్లు అనుమానిస్తున్న సీఐడీ విచారణ ప్రారంభించి ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ,సుజనా చౌదరి , లింగమనేని ఇలా పెద్దతలకాయలతోబాటు వారి బినామీలతో కూడా భూములు కొనిపించినట్లు ఆధారాలు దొరుకుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఇద్దరితోబాటు తిరుపతిలో స్కూల్ నడుపుతున్న ఇంకో వ్యక్తి, మొత్తం ముగ్గురి పేరిట ఆరేకరాలు కొన్నట్లు సీఐడీ గుర్తించింది. తెల్లకార్డు దారులైన ఈ ముగ్గురూ పరిటాల సునీతకు బినామీలుగా సీఐడీ అనుమనిస్తోంది.
అనంతపురం జిల్లా కనగానపల్లికి చెందిన బి నిర్మలాదేవి పేరు మీద అరెకరం, బదలాపురం గ్రామానికి చెందిన జయరామ్ చౌదరి పేరుమీద మరో అరెకరం భూమిని గుంటూరు జిల్లా
తాడికొండ గ్రామంలో కొన్నారు. వీరితోపాటు మరో వ్యక్తి పేరు మీద కూడా భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీ విచారణలో తేలింది. ఈ ముగ్గురూ తెల్లకార్డు దారులే.
నిర్మలాదేవికి తన సొంత గ్రామంలో ఆరెకరాల వ్యవసాయ భూమి ఉంది. జయరాం చౌదరి వై బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు తేలింది. చౌదరికి చాలా ఆస్తులున్నట్లు అదికారులు గుర్తించారు. అయినప్పటికీ ఆయనకు తెల్లరేషన్ కార్డు ఎలా వచ్చిందనేది కూడా విచారిస్తున్నారు. వీరిద్దరితోపాటు మరో వ్యక్తి అక్కడే ఓ ప్రైవేట్ స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గురూ సునీత బినామీలుగా అనుమానిస్తున్న సీఐడీ విచారణను ముమ్మరం చేసి, మరిన్ని వివరాలు తవ్వి తీసే పనిలో పడింది.