ఒలంపిక్స్ క్రీడాకారుల కోసం యాంటీ సె*క్స్ బెడ్స్.. అసలేంటి వీటి ప్రత్యేకత?

Paris Olympics- Special Beds For Athletes: మరో నెలరోజుల్లో పారిస్ ఒలంపిక్స్ 2024 ప్రారంభం కాబోతోంది. ఈ ఒలంపిక్స్ కోసం ఆర్గనైజర్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వాటిలో భాగంగానే యాంటీ సె*క్స్ బెడ్స్ ని ఏర్పాటు చేశారు.

Paris Olympics- Special Beds For Athletes: మరో నెలరోజుల్లో పారిస్ ఒలంపిక్స్ 2024 ప్రారంభం కాబోతోంది. ఈ ఒలంపిక్స్ కోసం ఆర్గనైజర్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వాటిలో భాగంగానే యాంటీ సె*క్స్ బెడ్స్ ని ఏర్పాటు చేశారు.

మీరు ఇప్పటివరకు చాలా రకాల బెడ్స్, పరుపుల గురించి వినే ఉంటారు. అయితే ఎప్పుడైనా యాంటీ సె*క్స్ బెడ్స్ గురించి విన్నారా? అసలు అలాంటి బెడ్స్ ఉన్నాయని మీకు తెలుసా? ఇప్పుడు అలాంటి బెడ్స్ ని 2024 పారిస్ ఒలంపిక్స్ తీసుకొస్తున్నారు. అక్కడ ఉండే అథ్లెట్లకు వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ బెడ్స్ వల్ల చాలానే ఉపయోగం ఉంది. అయితే ప్రధానంగా ఇవి శృOగారాని సహకరించే బెడ్స్ కాదు. అయితే వీటిని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కాదులెండి. 2020 టోక్యో ఒలంపిక్స్ లో వీటినే ఉపయోగించారు. అలాంటి వాటినే 2024 పారిస్ ఒలంపిక్స్ లో కూడా ఉపయోగించనున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఈ బెడ్స్ గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది.

జపాన్ కు చెందిన ఎయిర్ వేవ్ అనే పరుపుల తయారీ కంపెనీ ఈ బెడ్స్ ని తయారు చేస్తుంది. ఈ కంపెనీకి చెందిన మొత్తం 16,000 బెడ్స్ ని పారిస్ ఒలంపిక్స్ కోసం తయారు చేయించారు. ఈ బెడ్స్ ని కార్ట్ బోర్డ్ తో తయారు చేస్తారు. ఈ ట్విన్స్ సైజ్డ్ బెడ్స్ ను పాలిథిలైన్ తో తయారు చేస్తారు. వాటిని కార్ట్ బోర్డ్ ఫ్రేమ్ మీద ప్లేస్ చేస్తారు. ఈ బెడ్ మీద ఎంత పెద్ద వ్యక్తి అయినా పడుకోవచ్చు. కానీ, ఇద్దరు మాత్రం ఈ మంచం మీద పడుకోలేరు. అది సాధ్యం కాదు. ఆ బరువను కూడా ఈ బెడ్స్ ఆపలేవు. అందుకే వీటికి యాంటీ సె*క్స్ బెడ్స్ అనే పేరు వచ్చింది. 2020లో ఈ బెడ్స్ వల్ల అక్కడి అథ్లెట్స్ శృOగారంలో పాల్గొనలేకపోయారంట. అప్పటి నుంచే వీటికి ఈ పేరు వచ్చింది.

ఎందుకు ఈ బెడ్స్?:

ఈ బెడ్స్ ని సెలక్ట్ చేయడానికి అసలు అథ్లెట్స్ ని సె*క్స్ కార్యక్రమాల నుంచి దూరంగా ఉంచాలని కాదు. వారి ఉద్దేశం పర్యావరణానికి మేలు చేయాలి అని చూడటమే. సాధారణంగా ఒలింపిక్స్ అంటే.. గేమ్స్ పూర్తైన తర్వాత లెక్కలేనంత చెత్త ఏర్పడుతుంది. ఆ చెత్త వల్ల పర్యావరణానికి కీడు జరగడమే కాకుండా.. దానిని రీసైకిల్ చేయడం కూడా చాలా కష్టం. అందుకే ఇలాంటి బెడ్స్, మ్యాట్రెసెస్ ను వాడుతున్నట్లు కొందరు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాకుండా ఇలాంటి బెడ్స్ వల్ల ఎన్నో లక్షల చెట్లను నరకుండా కాపాడినట్లు అయ్యిందని చెప్పారు. అలాగే ఈ కార్ట్ బోర్డ్స్ అయితే రీసైకిలింగ్ కి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి అంటున్నారు. అందుకే ఇలాంటి బెడ్స్ ని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.

అయితే ఒలంపిక్స్ అంటే అసలు శృOగారం ఉండదా అని ఆశ్చర్యపోకండి. అక్కడ ఆర్గనైజర్స్ స్వయంగా కం*డోమ్స్ సరఫరా చేస్తూ ఉంటారు. ఇది ఇప్పటి ఏర్పాట్లు కాదు.. 1988 సియోల్ ఒలంపిక్స్ లోనే ఈ కార్యక్రమాలను ప్రారంభించారు. 2016లో అయితే ఏకంగా 4,50,000 కం*డోమ్స్ సరఫరా చేశారు. ఈసారి కూడా అలాంటి ఏర్పాట్లు ఉంటాయి. అందుకోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి.. ఒలంపిక్స్ లో వాడుతున్న ఈ యాంటీ సె*క్స్ బెడ్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments